School Holidays: దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండికొడుతున్నాయి.నిన్నటి నుంచి ఏకధాటిగా వాన పడుతోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. అయితే ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది.
Free Training: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉపాధి కోర్సులపై ఉచిత శిక్షణ
హైదరాబాద్ సమా రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోనూ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
#Tags