School Holiday: నవంబర్ 30న పాఠశాలలకు సెలవు.. కారణం ఇదే..?
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.నవంబర్ 30న పోలింగ్ తేదీ ఖరారు చేయడంతో ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.కాగా తెలంగాణ ప్రభుత్వం పోలింగ్ జరిగే నవంబర్ 30 వతేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది.
ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.నవంబర్ 29న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు,పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించామని తెలిపారు. అలాగే డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: Telangana Assembly Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా
#Tags