Santoor Scholarship Program: సంతూర్ స్కాలర్‌షిప్ 2024: విద్యార్థినులకు అద్భుతమైన అవకాశం!
విప్రో కన్స్యూమర్ కేర్ మరియు విప్రో కేర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024 ద్వారా 12వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది.
సంతూర్ స్కాలర్‌షిప్ 2024 కోసం విద్యార్థులు నుంచి దరఖాస్తులు కోరుతుంది విప్రో కన్స్యూమర్ కేర్ మరియు విప్రో కేర్స్.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
స్థానిక ప్రభుత్వ పాఠశాల నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన
2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల/జూనియర్ కళాశాల నుండి 12వ తరగతి ఉత్తీర్ణులైన
2024-25 నుండి పూర్తి సమయం గ్రాడ్యుయేట్ కోర్సులో చేరబోయే యువతులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత మొత్తం స్కాలర్‌షిప్ లభిస్తుంది?
ఎంపికైన ప్రతి విద్యార్థికి సంవత్తరంకు రూ.24,000/- స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ మొత్తాన్ని నీ ఫీజులు లేదా ఇతర అధ్యయన ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
చివరి తేదీ: సెప్టెంబర్ 25, 2024
వెబ్‌సైట్: www.santoorscholarships.com
అప్లై చేయండి: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లేదా వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి పంపండి.