Skip to main content

CBSE Board Exam 2025 Registration Deadline: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఇదే

CBSE Board Exams registration announcement CBSE exams registration submission due date CBSE Board Exam 2025 Registration Deadline CBSE Class 10, 12 Board Exam 2025 registration process begins see the deadline

సీబీఎస్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల జాబితాను పరీక్షా సంగం పోర్టల్‌ parikshasangam.cbseలో నమోదు చేయాల్సి ఉంటుందని పాఠశాలలను ఆదేశించింది. అక్టోబర్‌ 04 లోగా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది సీబీఎస్‌ఈ పేర్కొంది.

CBSE releases Sample Question Papers: త్వరలోనే ఫైనల్‌ ఎగ్జామ్స్‌.. శాంపుల్‌ ప్రశ్నపత్రాలు రిలీజ్‌ చేసిన సీబీఎస్‌ఈ

ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 5 నుంచి అక్టోబర్‌ 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి 15, 2025లో సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డ్‌ ఎగ్జామ్స్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి ఫైనల్‌ ఎగ్జామ్స్‌ నమూనా ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌cbseacademic.nic.in. నుంచి శాంపుల్‌ క్వశ్చన్‌ పేపర్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Apply For 50,000 Govt Job Vacancies: భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. మొత్తం ఖాళీలు, చివరి తేదీ వివరాలివే..


CBSE బోర్డ్‌ ఎగ్జామ్స్‌.. ఇలా రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ cbse.gov.inను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న Class 10 and 12 Board Exams Registration 2025 అనే లింక్‌ను క్లిక్‌ చేయండి
  • మీ పేరు, పుట్టినరోజు వివరాలు, స్కూల్‌ కోడ్‌ వంటి వివరాలను నమోదు చేయండి
  • అవసరమైన డాక్యుమెంట్స్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, సిగ్నేచర్‌, స్కూల్‌ ఐడీ ప్రూఫ్‌ వంటి వివరాలను అప్‌లోడ్‌ చేయండి
  • తర్వాత పేజీలో పేమెంట్‌ ఆప్షన్‌ చూపిస్తుంది.. డెబిట్‌/క్రిడిట్‌/యూపీఐతో పేమెంట్‌ చేయండి
  • వివరాలను సబ్‌మిట్‌ చేసేముందు మరోసారి క్రాస్‌చెక్‌ చేసుకొని సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి
     
Published date : 12 Sep 2024 12:44PM

Photo Stories