Private School Education: ప్రైవేటు పాఠ‌శాల విద్య ఇప్పుడు పేద విద్యార్థుల‌కు కూడా..!

ఎలాంటి ఖర్చు లేకుండా 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఖరీదైన, నాణ్యమైన విద్యను ఉచితంగా అందజేస్తోంది ప్రభుత్వం.

పార్వతీపురం: ఉన్నత వర్గాల వారి పిల్లలకే పరిమితమైన ప్రైవేట్‌ పాఠశాలల విద్యను నేడు ప్రభుత్వం పేద పిల్లలకు సైతం చేరువ చేస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండా 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఖరీదైన, నాణ్యమైన విద్యను ఉచితంగా అందజేస్తోంది. ఈ మేరకు ప్రతి ఏటా జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదవారికి కేటాయిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది 198 మందికి అవకాశం లభించనుంది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల వారికి చెందిన పిల్లలకు కార్పొరేట్‌ చదువులు అందనుండడంతో ఆయా కుటుంబాల్లో సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది.

Joint Trade Committee: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి భారత్-నైజీరియా ఒప్పందం

అమల్లో విద్యాహక్కు చట్టం

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో 90 పాఠశాలల్లో ఉండగా వాటిలో 25 శాతం సీట్లను ఉచిత విద్యకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించి విద్యాశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయి. ఐదేళ్లు నిండిన వారికి మాత్రమే 1వ తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తున్నారు.

College Inspection: క‌ళాశాల‌లో న్యాక్‌కి ముందు ఈ క‌మిటీ స‌భ్యుల సంద‌ర్శ‌న‌..!

లాటరీ పద్ధతిలో ఎంపిక

ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను లాటరీ పద్ధతిలో మొదటి విడత సీట్లు ఎంపిక చేశారు. వారంతా ఆయా పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం పొందాల్సి ఉంది. ఈ విషయమై ఎంఈఓలు ప్రత్యేక శ్రద్ధ చూపి ఎంపికై న విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులను చెల్లించనుంది. ఇంతవరకు 93మంది ఆయా పాఠశాలల్లో చేరారు. మిగిలినవారు కొద్ది రోజుల్లో చేరనున్నారు.

First Class Students: ఈనెల 10లోగా ఉచిత సీట్ల‌లో విద్యార్థుల‌ను చేర్పించాలి..!

#Tags