Prahari Clubs at Schools : పాఠ‌శాల‌ల్లో ప్ర‌హ‌రీ క్ల‌బ్‌లు.. విద్యార్థుల‌ను వీటి నుంచి అప్ర‌మ‌త్తంగా ఉండేలా చ‌ర్య‌లు..

గుంటూరు: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో ప్రహరీ క్లబ్‌ (చిల్డ్రన్స్‌ క్లబ్‌)లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్‌, మాదకద్రవ్యాల అమ్మకాలను నిషేధించడం, ఆయా హానికారక పదార్ధాల నుంచి అప్రమత్తంగా ఉండేలా విద్యార్థులను చైతన్యపర్చడం క్లబ్‌ల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు.

Job Mela: ఈనెల 30న జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఫిజికల్‌ డైరెక్టర్‌ల ఆధ్వర్యంలో 300 మందిలోపు విద్యార్థులు ఉంటే 20 నుంచి 25 మందికి, 300మందికి పైన ప్రతి 100 మంది విద్యార్థులకు ఇద్దరు చొప్పున సభ్యులను ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేసి, సంబంధిత క్లబ్‌ల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలని డీవైఈఓలు, ఎంఈవోలతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

DEECET: డీఈఈసెట్‌లో కామారెడ్డి జిల్లావాసికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

#Tags