ఓపెన్ స్కూల్ ఎంతో సులభమైంది
విద్యారణ్యపురి: సార్వత్రిక విద్య ద్వారా టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలని, ఓపెన్ స్కూల్ విద్య ఎంతో సులభమైందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
ఓపెన్ స్కూల్ ప్రాధాన్యతపై అవగాహనలో భాగంగా సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ మురాల శంకర్‌రావుతో కలిసి అడ్మిషన్ల పోస్టర్, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ అందరికీ విద్య అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశమన్నారు. మధ్యలో చదువును మానేసినవారికి ఓపెన్ స్కూల్ ఓ వరం అని తెలిపారు. అడ్మిషన్లకు ఈ నెల 31వరకు అవకాశం ఉందని, ఆసక్తి ఉన్నవారు అడ్మిషన్లు పొందేందుకు అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లను సంప్రదించాలన్నారు. ఓపెన్ స్కూ ల్ సిబ్బంది అవినాష్, రత్నాకర్ పాల్గొన్నారు.
#Tags