10th Class & Inter: సులభతరం ‘Open School’ విధానం

విద్యారణ్యపురి : చదువు మధ్యలో ఆపివేసిన, బడికి వెళ్లే పరిస్థితి లేని వారికి సార్వత్రిక విద్య(ఓపెన్‌ స్కూల్‌) విధానం ఎంతో సులభమైంది.

మళ్లీ చదువుకునేందుకు అభ్యాసకులకు ఓపెన్‌ స్కూల్‌ విద్య ఓ వరమని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రోగ్రాం కోఆర్డి నేటర్‌ మురాల శంకర్‌రావు అన్నారు. జ‌నవ‌రి 28న‌ హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌, ప్రభుత్వ ప్రాక్టిసింగ్‌ హైస్కూల్‌లో ఓపెన్‌ పది, ఇంటర్‌ విద్యార్థులకు నిర్వహిస్తున్న అధ్యయన తరగతులను ఆయన పరిశీలించారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ప్రతి రెండో శనివారం, జ‌నవ‌రి 28న‌ తప్పనిసరిగా విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని కోరారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా హెచ్‌ఎంలు రామారావు, జగన్‌, అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ నరేందర్‌రెడ్డి, భిక్షపతి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

#Tags