Kaushal Exams 2023: కౌశల్ పోస్టర్‌ను ఆవిశ్కరించిన విద్యాశాఖాధికారి
ఈ ఏడాది విద్యార్థులకు కౌశల్ పరీక్షలను నిర్వహించే నేపథ్యంలో విద్యాశాఖాధికారి తమ కార్యాలయంలో నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు అందరూ మంచి ప్రతిభను కనబరచాలని ప్రోత్సాహించారు.
సాక్షి ఎడ్యుకేషన్: కౌశల్ క్విజ్ పరీక్ష–2023కు నోటిఫికేషన్ విడుదలైనట్టు పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ తెలిపారు. స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో కౌశల్–2023 పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. క్విజ్ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8,9,10 విద్యార్థులు జట్టుగా ఏర్పడాలన్నారు.
Inter Examinations: ఫెయిలైన విద్యార్థులకు ఫీజు సమయం పొడుగింపు
ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక, నగదు పురస్కారం అందజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9492566794లో సంప్రదించాలన్నారు. డీవైఈఓ డి.శ్రీరామ్, సూపరింటెండెంట్ తిరుపతిరాజు, కౌశల్ జిల్లా సమన్వయకర్త ఆర్‌వీ సూర్యనారాయణ, జాయింట్ సమన్వయకర్త ఎం.నారాయణరాజు పాల్గొనారు.
#Tags