Inter Examinations: ఫెయిలైన విద్యార్థులకు ఫీజు సమయం పొడుగింపు
సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించే గడువును పొడిగించినట్లు ఇంటర్ బోర్డు డీవీఈఓ ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువును నవంబరు 30వ తేదీ వరకూ పొడిగించారన్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు, మధ్యలో కళాశాల మానివేసిన వారు, జనరల్, ఒకేషన్ కోర్సులు చదివిన విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఫీజు చెల్లించే అవకాశముందన్నారు.
Inter Exams: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు..
నిర్ణీత ఫీజుల మొత్తాన్ని చెల్లించి, పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఫెయిలైన విద్యార్థి తిరిగి కళాశాలలో అడ్మిషన్ పొందిన అన్ని పరీక్షలకు హాజరైతే ఎక్కువ మార్కులు వచ్చిన దానిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అలాగే కంపార్ట్‌మెంటల్, ఫెయిల్ అని కాకుండా ఒకేసారి ఉత్తీర్ణులైనట్లుగా సర్టిఫికెట్ జారీ చేస్తామన్నారు. అలాగే కళాశాలలో తిరిగి అడ్మిషన్ పొందిన విద్యార్థులకు జగనన్న అమ్మఒడి, ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో ప్రవేశం పొందవచ్చన్నారు.