NCC Training: శిక్షణతో పాటు సర్టిఫికెట్‌... ఉన్నత విద్య, ఉద్యోగాలలో ప్రత్యేక ప్రాధాన్యత!

ఎన్‌సీసీలో శిక్షణ.. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతోంది. దేశ సేవ చేయాలనే ఆలోచన ఉండి.. ఇక్కడ శిక్షణ పొందితే సర్టిఫికెట్‌ను అందిస్తున్నారు. ఇవి ఉన్నత విద్య, ఉద్యోగాలను సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆర్మీ, నేవీ యూనిట్లు ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఉపయోగపడుతున్న సర్టిఫికెట్లు. జిల్లాలో ఆరు వేల మందికిపైగా విద్యార్థులకు శిక్షణ.

జిల్లాలో మూడు ఎన్‌సీసీ యూనిట్లు

జిల్లాలో మూడు ఎన్‌సీసీ యూనిట్ల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లో శిక్షణను నిర్వహిస్తున్నారు. కొండాయపాళెంలోని స్నేహనగర్‌లో 24 ఆంధ్రా బెటాలియన్‌, 10 ఆంధ్రా నావల్‌ యూనిట్లు.. పొదలకూరు రోడ్డులో 2 ఏ ఈఎంఈ యూనిట్‌ పనిచేస్తోంది. వీటి ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో ఆరు వేల మందికిపైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ వీరిని భాగస్వాములను చేస్తున్నారు.

English: విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడాలి

రెండు స్థాయిల్లో శిక్షణ

● పాఠశాల స్థాయిలో 8, 9వ తరగతుల విద్యార్థులను జూనియర్‌ స్థాయిగా పరిగణిస్తారు. వీరు రెండేళ్ల పాటు ఎన్‌సీసీలో శిక్షణ పొందుతారు. అనంతరం డ్రిల్‌, రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఏ సర్టిఫికెట్‌ను అందిస్తారు.

● ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులను సీనియర్‌ స్థాయిగా పరిగణిస్తారు. రెండేళ్ల పాటు నిర్వహించే శిక్షణ కాలంలో డ్రిల్‌, ఫైరింగ్‌, జనరల్‌ నాలెడ్జి అంశాలపై తర్ఫీదు ఉంటుంది. అనంతరం డ్రిల్‌, ఫైరింగ్‌, లిఖిత పరీక్షలను నిర్వహించి, ఉత్తర్ణులైన వారికి బీ, సీ సర్టిఫికెట్లను అందజేస్తారు.

ఇవీ ఉపయోగాలు..

● ఎన్‌సీసీలో శిక్షణ అనంతరం అందించే ఏ, బీ, సీ సర్టిఫికెట్లు విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పాలిటెక్నిక్‌, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సెలింగ్‌లో ఎన్‌సీసీ సర్టిఫికెట్లు కలిగిన వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి సీట్లు కేటాయిస్తారు.

● సీ సర్టిఫికెట్‌ పొందిన అభ్యర్థులకు ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఆర్మీలో అవకాశం కల్పిస్తారు.

● ఎన్‌సీసీ ఏ, బీ, సీ సర్టిఫికెట్లు కలిగిన వారికి పోలీస్‌ నియామక పరీక్షల్లో అదనంగా మార్కులు కేటాయిస్తారు.

● వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, నిఘా, భద్రత, సెక్యూరిటీ ఉద్యోగాల్లో వీరికి ప్రాధాన్యం లభిస్తుంది.

Talented Students: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ!

#Tags