National Merit Scholarship 2024: ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఉపకార వేతనాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు

పేద విద్యార్థులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ప్రతిభ గల వారిని ఎంపిక చేసి నాలుగేళ్లపాటు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తోంది.

కడప ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రతిభ గల పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక బరోసా కల్పించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) అందజేస్తోంది. ఇందుకోసం ప్రతి ఏటా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి విద్యార్థులు ఈ పరీక్షలో ప్రతిభ చూపి ఎంపికై న విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. 9 వతరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తయ్యేంత వరకూ ఏటా ఈ ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది. ఎక్కువ మంది ఈ పరీక్ష రాసేలా విద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం, మొత్తం ఎన్ని ఖాళీలంటే..

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..
ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఎనిమిదో తరగతి విద్యార్థుల నుంచి సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష రుసుము చెల్లించడానికి సెప్టెంబరు 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. డిసెంబర్‌ 8న పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే రూ.50 చొప్పున ఫీజు ఆన్‌లైన్‌లో సూచించిన ఎస్‌బీఐ లింక్‌ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

అర్హతలు తప్పనిసరి..
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోత్సాహకాలకు అర్హులు. ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు, తుది ఎంపిక సమయం నాటికి 8వ తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. కుటుంబ వార్షికాదాయం ఏడాదికి రూ. 3,50,000లకు మించకూడదు.

Best School Award: ముచ్చటగా మూడోసారి..బెస్ట్‌ స్కూల్‌గా అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ పాఠశాల

ప్రశ్నపత్రం విధానం ఇలా..
అర్హులైన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. 180 మార్కులతో మెంటల్‌ ఎబిలిటీ(మ్యాట్‌), స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌) ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. తొలుత మ్యాట్‌ తొలి పేపర్‌లో మూడు విభాగాల నుంచి 90 ప్రశ్నలు అడుగుతారు. మెంటల్‌ ఎబిలిటీ నుంచి 45, ఇంగ్లీష్‌ ప్రొఫెషియన్సీలో 20, హిందీ ప్రొఫెషియన్సీలో 25 ప్రశ్నలు ఇస్తారు. అనంతరం శాట్‌ రెండో పేపర్‌లో మూడు విభాగాల నుంచి 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సైన్స్‌లో 35, సోషియల్‌లో 35, మేథమేటిక్స్‌లో 20 ప్రశ్నలు ఉంటాయి.
 

#Tags