Monday Schools Holiday Due to Heavy Rain : రానున్న మూడు రోజులు భారీ వ‌ర్షాలు.. సోమవారం అన్ని స్కూల్స్‌కు సెల‌వు.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ముందుజాగ్రత్తగా హైదరాబాద్‌లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ స్కూళ్లకు కలెక్టర్ సెప్టెంబ‌ర్ 2వ తేదీన అన‌గా.. సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున .. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

తెలంగాణ‌లోని వివిధ జిల్లాల్లో...
వర్షాలు, వరదల పరిస్థితిని అంచనా వేసి జిల్లాల పరిధిలో స్కూళ్లకు సెలవు ప్రకటించే విషయంలో కలెక్టర్లదే నిర్ణయమని చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. వ‌ర్ష‌తీవ్ర‌త‌ను బ‌ట్టి తెలంగాణ‌లో వివిధ జిల్లాల్లో స్కూల్స్ సోమ‌వారం సెల‌వు సీఎస్ శాంతికుమారి తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. తెలంగాణతో పాటు ఏపీకి ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం...
ఏపీలో కూడా భారీ వర్షాలున్న జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పలుచోట్ల ప్రైవేట్ స్కూళ్లు సెలవులు ఇవ్వడం లేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. ప్రైవేట్ విద్యాసంస్థలూ తమ ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ముందురోజే సెలవుపై ప్రకటన చేయాలన్నారు. ఉప్పలపాడు ఘటనలో స్కూలుకు సెలవు ఇవ్వలేదా అని సీఎం అడగ్గా, మధ్యాహ్నం తర్వాత ఇచ్చారని అధికారులు బదులిచ్చారు. 

#Tags