Model School: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఆదర్శ పాఠశాలల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 5వ తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నపత్రం ఉంటుందని వివరించారు. మార్కులు, రిజర్వేషన్ ప్రకారం పాఠశాలల్లో ప్రవేశం ఉంటుందన్నారు.
పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.150లు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 చెల్లించాలన్నారు. విద్యార్థులు www.cre.ap.gov.in/apmr.ap.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీలోపు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించిన వారికి ఒక జనరల్ నెంబరు కేటాయిస్తారని, సదరు నంబరుతో ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు అప్‌లోడ్ చేయవచ్చని తెలిపారు. వివరాలకు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్స్, జిల్లా, మండల విద్యాశాఖ కార్యాలయాల్లో సంప్రదించవ్చని డీఈఓ చెప్పారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్