AP Model School Admissions: ఏపీ మోడ‌ల్ స్కూల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

2024–25 విద్యాసంవత్సరానికి 6 నుంచి 9 తరగతులలో ప్రవేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతూ.. పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించారు..

జెట్టిపాలెం: స్థానిక ఆదర్శ పాఠశాల (ఏపీ మోడల్‌ స్కూల్‌)లో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి 6 నుంచి 9వ తరగతులలో ప్రవేశానికి ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కె.పాపయ్య కోరారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో వివరాలు వెల్లడించారు. దరఖాస్తులను పాఠశాలలో నేరుగా అందచేయాలన్నారు. ఆంగ్లంలో ఉచితంగా విద్యాభోదన జరుగుతుందన్నారు. 6, 7, తరగతులు స్టేట్‌ సిలబస్‌, 8, 9 తరగతులు సెంట్రల్‌ సిలబస్‌ ఉంటుందన్నారు.

Private Schools Admissions: ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఫీజు క‌డితేనే అడ్మిష‌న్‌..! లేకుంటే..

2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఖాళీలకు ప్రవేశాలకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో చేరేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆంగ్లంలో భోదన ఉంటుందని ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవన్నారు. 6 తరగతిలో 35 ఖాళీలు, 7 వ తరగతిలో 40 ఖాళీలు, 8 వ తరగతిలో 25 ఖాళీలు, 9 వ తరగతిలో 35 ఖాళీలు, ఇంటర్‌ ఫస్ట్‌యర్‌లో 40 ఖాళీలు, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో 50 ఖాళీలు ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు పాఠశాలలో ప్రిన్సిపాల్‌ 9182958496 ను సంప్రదించాలని కోరారు.

 TS Inter Colleges Admissions 2024-25 : ఇంటర్ విద్యార్థుల‌కు బోర్డు కీలక హెచ్చ‌రిక‌.. ఈ కాలేజీల్లో..

#Tags