Schools Holidays : విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. వ‌రుస‌గా నాలుగు రోజుల‌పాటు సెల‌వులు.. ప్ర‌భుత్వం కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌లు పాఠ‌శాల‌ల‌కు వ‌రుస‌గా నాలుగు రోజుల‌పాటు సెల‌వులు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌లు పాఠ‌శాల‌ల‌కు వ‌రుస‌గా నాలుగు రోజుల‌పాటు సెల‌వులు వ‌స్తే, మ‌రికొన్ని పాఠ‌శాల‌ల‌కు మాత్రం కేవ‌లం మూడు రోజులే సెల‌వులు వ‌చ్చాయి. అయితే, ఈ వ‌రుస సెల‌వుల వివ‌రాల్లోకి వ‌స్తే.. ఈనెల 14 అంటే, రెండో శ‌నివారం.. విద్యాసంస్థ‌ల‌కు ఎలాగో సెల‌వే ఉంటుంది. త‌దుప‌రి రోజు ఆదివారం అదీ సెల‌వు రోజే. మ‌రి సోమ‌క‌వారం..? ఆ రోజు సెప్టెంబ‌ర్ 16 మిలాద్ ఉన్ నబీ మ‌రుస‌టి రోజు వినాయ‌క నిమ‌ర్జ‌నం ఈ రోజును కూడా సెల‌వు రోజే అని ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.

వ‌రుస‌గా నాలుగు రోజులు..

అయితే, 16వ తేదీన తెలంగాణ ప్ర‌భుత్వం సెల‌వును ర‌ద్దు చేసింది. కాని, మిగిలిన సెల‌వులు అలాగే ఉన్నాయి.  సెప్టెంబర్ 14వ తేదీన రెండో శనివారం కావడంతో పాఠశాలలకు సెలవు ఉంది. 15వ తేదీ ఆదివారం ఆ రోజు సెలవు ఉంటుంది. 16వ తేదీ మిలాద్ ఉన్ నబీ ఆరోజు సెలవు. 17వ తేదీన వినాయకన నిమజ్జనోత్సవం ఉంది. ఆరోజు కూడా సెలువు ప్రకటించారు.ఇలా వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. అయితే 16న తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. ఈనెల 14, 15వ తేదీల్లో సెలవులు అలాగే ఉన్నాయి.

Best Countries Ranking: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ దేశాలు ఇవే..

16న మిలాద్ ఉన్ నబీ (మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు) పండుగ తేదీ మారడంతో.. నెలవంక దర్శనాన్ని బట్టీ 16న కాకుండా.. 17న జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వం 16వ తేదీన సెలవును రద్దు చేసి, 17వ తేదీన ఇస్తున్నట్లు ప్రకటించింది. మరో విషయం ఏంటంటే, నెలవంక 16న కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది. అయితే, ఇప్పటికే ప‌లు స్కూళ్ల‌కు నాలుగు రోజులు సెల‌వులంటూ ప్ర‌క‌టించారు.

Singareni Apprenticeship 2024 Applications : సింగరేణిలో అప్రెంటీస్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు... అర్హ‌త‌లు ఇవే...

సెప్టెంబర్‌ నెల హాలిడేస్‌ జాబితా:

☛ సెప్టెంబర్‌ 14 రెండో శనివారం

☛ సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు

☛ సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలుడే

☛ సెప్టెంబర్ 17 వినాయక నిమజ్జనోత్సవం

☛ సెప్టెంబర్ 22 ఆదివారం అందరికీ సెలవు

☛ సెప్టెంబర్ 28 నాలుగో శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు

☛ సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అందరికీ సెలవు

#Tags