Good News For School Students : స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై వీరికి 10 రోజులు పాటు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర‌ప్ర‌భుత్వం స్కూల్స్ విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. జాతీయ విద్యావిధానం అమలులోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన సందర్భంగా.. ఎన్‌సీఆర్‌టీ అనుబంధ విభాగం రూపొందించిన మార్గదర్శకాలను ఇటీవలే కేంద్రం నోటిఫై చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి విద్యార్థి నో స్కూల్ బ్యాగ్ డేస్‌ల్లో కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్, మెటల్ వర్క్, వంటి ఒక వృత్తి విద్య కోర్సును నేర్చుకుంటారు.

వీటి వల్ల ఆయా రాష్ట్రాల్లో స్థానిక వృత్తులకు సంబంధించినవి నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక కమ్యూనిటీలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రతి ఏటా పది రోజుల చొప్పున నో స్కూల్ బ్యాగ్ డేను అమలు చేయనున్నారు. మొదట ఈ విధానాన్ని 6వ త‌ర‌గ‌తి నుంచి 8వ తరగతి విద్యార్థులకు అమలు చేయనున్నారు.

➤☛ Schools and Colleges Dasara & Sankranti Festivals Holidays 2024 : ఈ సారి భారీగా స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా, సంక్రాంతి సెల‌వులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఈ పది రోజులు మాత్రం..
అవసరాన్ని బట్టి ఇండోర్, అవుట్ డోర్ కార్యకలాపాలను కూడా నిర్ణయించవచ్చు. నో స్కూల్ బ్యాగ్ డేస్‌లను విద్యా సంవత్సరంలో ఎన్ని స్లాట్లుగా అయినా విభజన చేసుకోవచ్చు. రెండు మూడు స్లాట్లు విభజించుకుంటే సరిగా ఉంటుంది. అవకాశాన్ని బట్టి తేదీలను పాఠశాల యాజమాన్యం నిర్ణయించుకోవచ్చు. ఈ పది రోజులు మాత్రం విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాల్సి ఉంటుంది.

నో స్కూల్ బ్యాగ్ డే ఉన్న ఈ పదిరోజులు..
నో స్కూల్ బ్యాగ్ డే ఉన్న పదిరోజులు విద్యార్థులు కూరగాయల మార్కెట్ (రైతు బజార్లు) ను సందర్శించి సర్వే చేయడం, దాతృత్వ పర్యటనలు, పెంపుడు జంతువుల కేంద్రాలను సందర్శించడం, డూడ్లింగ్, పతంగుల తయారీ, ఎగురవేయడం, పుస్తక ప్రదర్శన వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, మర్రిచెట్టు కింద కూర్చోవడం, బయోగ్యాస్‌ ప్లాంట్‌ను సందర్శన, సోలార్‌ విద్యుత్తు పార్కును సందర్శించడం వంటి అవుట్ డోర్ కార్యక్రమాలను చేపట్టవచ్చు. జాతీయ విద్యా విధానానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మరికొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా చేపట్టింది. అందులో భాగంగానే 25 భారతీయ భాషల్లో టీవీ ఛానళ్లను కేంద్రం ప్రారంభించింది. ఇక, ఇందులో కెరీర్ గైడెన్స్, ఉపాధ్యాయులకు బ్రెయిలీ, ఆడియో బుక్స్ ద్వారా ప్రామాణిక శిక్షణ పద్ధతులు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.

➤☛ Telangana School Holidays List 2024-25 : 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ విడుద‌ల‌.. ఈ ఏడాది సెల‌వులే సెల‌వులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags