Gurukul School Entrance Exam: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాఫీగా సాగిన గురుకుల ప్రవేశ పరీక్షలు..

ఆదివారం నిర్వహించిన గురుకుల ప్రవేశ పరీక్షకు వేలల్లో విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో హాజరైన విద్యార్థుల సంఖ్యను వెల్లడించారు జిల్లా కో-ఆర్డినేటర్‌..

నంద్యాల: ఉమ్మడి జిల్లాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్‌ ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. కర్నూలు జిల్లాలో 8 కేంద్రాలు, నంద్యాల జిల్లాలో ఆరు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 5వ తరగతికి సంబంధించి 11వేల మంది విద్యార్థులకు గాను 9,639 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

Training and Job Offer: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ భాషపై శిక్షణ

అలాగే ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 7,551 మంది విద్యార్థులకు గాను 6,560 మంది హాజరయ్యారు. కర్నూలు పరీక్ష కేంద్రాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల పర్యవేక్షకులు శ్రీనివాసరావు పరిశీలించారు. నంద్యాల జిల్లా ప్రవేశ పరీక్ష కేంద్రాలను జిల్లా గురుకుల పాఠశాల కో ఆర్డినేటర్‌ డి.రామసుబ్బారెడ్డి పరిశీలించారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్ష జరిగినట్లు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు.

#Tags