Volunteer System: విద్యా వాలంటీర్ల వ్యవస్థపై విద్యావేత్తల ప్రశంసలు..

పాఠశాలలో అమలు చేస్తున్న ఈ విద్య వాలంటీర్ల వ్యవస్థపై అధికారులు, గ్రామ పెద్దలు అభినందిస్తున్నారు.

గుంటూరు: పెదకాకాని మండలం వెనిగండ్లలోని శ్రీవేమన జెడ్పీ ఉన్నత పాఠశాలలో అమలు చేస్తున్న విద్య వలంటీర్‌ వ్యవస్థపై విద్యావేత్తలు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధే ధ్యేయంగా గ్రామ పెద్దలు, పేరెంట్స్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతుల నిర్వహణ ద్వారా సాధిస్తున్న చక్కటి ఫలితాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Japanese Language: జాపనీస్‌ భాషలో శిక్షణ.. జపాన్‌లో ఉద్యోగం..!

వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో అమలు చేస్తున్న విద్య వలంటీర్‌ వ్యవస్థపై ‘‘విద్యాకాంతులు మెరవాలంటీరో’’ శీర్షికతో సాక్షిలో గురువారం ప్రచురించిన కథనానికి ఎమ్మెల్సీలతో పాటు విద్యాశాఖాధికారులు స్పందించారు. వెనిగండ్ల గ్రామపెద్దలు, పేరెంట్స్‌ కమిటీ, తల్లిదండ్రులు సమిష్టిగా తీసుకున్న నిర్ణయంతో వినూత్నమైన ఒరవడికి శ్రీకారం చుట్టిన తీరును అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులకు ఇది నాందీ అంటూ ప్రశంసించారు.

Tenth Class Public Exams 2024: పదిలో ఉత్తమ మార్కుల కోసం ప్రణాళికతో సాధన చేస్తే వందకు వంద మార్కులు సాధ్యం

#Tags