Education System In Andhra Pradesh: ఏపీలో విద్యా విధానం,ఐబీ సిలబస్‌ అంతరాత్జీయ ప్రతినిధుల ప్రశంసలు

మధురవాడ (భీమిలి): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక (కరికులమ్‌)బాగున్నాయని ఐబీ సిలబస్‌ అంతరాత్జీయ ప్రతినిధులు యూఎస్‌ఏకి చెందిన సీనియర్‌ కరికులమ్‌ డిజైన్‌ మేనేజర్‌ ఆర్డర్, యూకేకి చెందిన అసోసియేట్‌ మేనేజర్‌ మైఖేల్‌ ప్రశంసలు కురిపించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఐబీ సిలబస్‌ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో నార్త్‌ డివిజన్‌లో 10 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ మహానగరంలోని చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం సందర్శించారు.

ఇక్కడ కరికులమ్, కంప్యూటర్‌ విద్య, వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులు పాఠాలను ఎలా అర్థం చేసుకుంటున్నారనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐఎఫ్‌పీ ప్యానల్స్, ట్యాబ్స్‌ ఉపయోగం, పిల్లల టాలెంట్స్‌ను పరిశీలించారు. బైలింగ్యువల్‌ టెక్ట్స్‌­బుక్స్‌ పిల్లలకు ఎలా ఉపయో­గపడుతున్నాయనే విషయాలతోపాటు బోధన తీరును కూడా పరిశీ­లిం­చా­రు. సైన్స్‌డేని పురస్కరించుకుని విద్యార్థులు త­యా­రు చేసిన మోడల్స్, వాటి గురించి వివరిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశా­రు.

ఎస్‌ఈఆర్‌టీ ఆచార్యులు శ్రీని­వాసరావు, డీఈఓ ఎల్‌.చంద్రకళ మాట్లాడుతూ.. ఐబీ సిలబస్‌ ప్రతిని­ధు­­­లు ఇక్కడి విద్యావిధానం బాగుందని చెప్పారన్నా­­రు. రాష్ట్రంలో విద్యా విధానాన్ని పరిశీలించి ఆకళింపు చేసుకున్న ఐబీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన­­కు వచ్చినట్టు చెప్పారు. ఇందులో భాగంగా వే­ర్వేరు పాఠశాలలు, తరగతులను పరిశీలిస్తున్నారన్నారు.  

#Tags