School Books Distribution: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో పాఠ్య‌పుస్త‌కాల పంపిణీ.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు..

మండల కేంద్రం యద్దనపూడిలో గురువారం స్టూడెంట్‌ కిట్లు, పాఠ్య పుస్తకాల పంపిణీని గుంటూరు ఆర్‌జేడీ బి. లింగేశ్వరరెడ్డి పరిశీలించారు..

యద్దనపూడి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని గుంటూరు ఆర్‌జేడీ బి. లింగేశ్వరరెడ్డి సూచించారు. మండల కేంద్రం యద్దనపూడిలో గురువారం స్టూడెంట్‌ కిట్లు, పాఠ్య పుస్తకాల పంపిణీని ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు ? ఇంకా ఎన్నిటికి పంపిణీ చేయాలి? అనే విషయాలను ఎంఈవో చిలుకూరి గోపీని అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో విద్యార్థులకు అందిస్తున్న బూట్లు కొలతల విషయంలో వ్యత్యాసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

National Anthem: జమ్మూ-కశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి

అనంతరం యద్దనపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు. బోధనలో ఐఎఫ్‌పీ ప్యానెల్‌ను ఎక్కువగా ఉపయోగించాలని, తద్వారా విద్యార్థులు చక్కగా గుర్తుంచుకోగలుగుతారని సూచించారు.

Recruitment Drive: ఐటీఐలో ఈనెల 18న క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌..

అనంతరం పాఠశాల ఆవరణలో వాటర్‌ ప్లాంట్‌ పని చేయకపోవడంపై హెచ్‌ఎం దేవేంద్రను ప్రశ్నించారు. చెరువులో నీరు లేనందునే సరఫరా నిలిచిపోయిందని ఆయన తెలిపారు. విద్యార్థులకు నీటి కొరత లేకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆర్‌జేడీ ఆదేశించారు. కార్యక్రమంలో పర్చూరు ఉప విద్యాశాఖాధికారి ఎం. నిర్మల, ప్రధానోపాధ్యాయులు దేవేంద్ర, రావి శ్రీనివాసరావు, ఎమ్మార్సీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

IIHT Diploma Courses: ఐఐహెచ్‌ఎలో డిప్లొమా కోర్సులలో ప్ర‌వేశానికి స్పాట్ అడ్మిష‌న్లు..

#Tags