Digital Education: నాడు-నేడుతో విద్యార్థులకు డిజిటల్‌ విద్య..!

నాడు-నేడు కార్యక్రమంలో ట్యాబ్‌ల కారణంగా విద్యార్థులకు సబ్జెక్టుల్లోని వివరాలను మరింత సులువుగా నేర్పించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగానే విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించారు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ముఖ్యంగా ఐఎఫ్‌బీ ప్యానల్‌ ద్వారా విద్యార్థులకు ఎలాంటి కంటెంట్‌ అయినా విజువల్‌ రూపంలో చూపించవచ్చు. బయాలజీ సబ్జెక్ట్‌లోని పువ్వులు, ఆకుల అంతర్భాగం, చర్మం అడ్డుకోత, మానవ శరీరం భాగాలు ఇలాంటివన్నీ ఐఎఫ్‌బీ ప్యానల్స్‌ ద్వారా విద్యార్థులకు చాలా సులభంగా అర్థం అవుతాయి. అలాగే గూగుల్‌, యూ ట్యూబ్‌లో ఉండే కంటెంట్‌ వీడియోలు సైతం చూపించవచ్చు.

Tenth Board Exams: మార్చి 18 నుంచి జరిగే బోర్డు పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం..!

ముఖ్యంగా బైజూస్‌ కంటెంట్‌ విద్యార్థులకు మరింత ఉపయోగపడుతుంది. నాడు–నేడు ద్వారా ఈ వసతులన్నీ మెరుగుపడ్డాయి. వాటిని ఉపయోగించడం వల్ల టీచింగ్‌ సులభంగా ఉండటంతోపాటు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

– రామిరెడ్డి శ్రీనివాసులరెడ్డి,

బయాలజీ అసిస్టెంట్‌, జెడ్పీ హైస్కూల్‌,

పెద్దచెప్పలి, కమలాపురం మండలం

Schools: అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాం

పిల్లలకు సాంకేతిక విద్య

నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలకు సాంకేతిక విద్య అందించారు. పిల్లలకు డిజిటల్‌ విద్యలో భాగంగా బైజూస్‌ కంటెంట్‌, ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానల్‌(ఐఎఫ్‌పీ) బోర్డులు ఏర్పాటు చేశారు. దీనివల్ల విద్యార్థులు డిజిటల్‌, సాంకేతిక విద్య నేర్చుకుంటున్నారు.

Work Integrated Learning Programmes: బిట్స్‌ పిలానిలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చారు. పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది.

– చింతపర్తి రాజారెడ్డి,

ఉపాధ్యాయుడు, జెడ్పీహెచ్‌ఎస్‌, మదనపల్లె 

#Tags