Work Integrated Learning Programmes: బిట్స్ పిలానిలో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్
ఫిబ్రవరి 15న ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. డబ్ల్యూ ఐఎల్‌పీ కోర్సులను మరింత అభివృద్ధి చేసిన్నట్లు తెలిపారు. 44 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆవిష్కరణతో పాటు సరికొత్త ఐటీ ఆధారిత కోర్సులను అందుబాటులో తీసుకొచ్చినట్లు వివరించారు. సాంకేతిక నిపుణుల్లో మరింత నైపుణ్యతను పెంచేవిధంగా కోర్సులు రూపొందించినట్లు తెలిపారు. వివిధ పరిశ్రమల అనుసంధానంతో వారి ఉద్యోగులకు నైపుణ్యత కోర్సులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: BITSAT 2024: మేటి ఇంజనీరింగ్‌కు మార్గం.. బిట్‌శాట్
తాజాగా ఆటోమెటిక్ సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్టీఫిషియల్ ఇంటలీజెనన్స్ తదితర పలు అంశాలపై శిక్షణ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. కేవలం వివిధ రంగాల్లో నిపుణుల కోసం అందించే ఈ కోర్సులు క్యాంపస్‌తో పాటు వారాంతపు శని, ఆదివారాలు కూడా ఉంటాయన్నారు. దాదాపు 16వారాలపాటు తరగతులుండే కోర్సుకు రెండు సెమిస్టర్లు ఉంటాయని వివరించారు.