Holidays 2023 : అక్టోబ‌ర్ 13 నుంచి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..? అలాగే ఏపీలో కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు.
ts dasara holidays 2023

ఈ సంద‌ర్భంగా బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అక్టోబ‌ర్ 13వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని సూచించింది. అలాగే తెలంగాణ‌లోని ఇంటర్మీడియట్‌ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులివ్వాలని పేర్కొన్నది.

ఏపీలో మాత్రం..


ఇక అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది.

అక్టోబర్ నెల‌లో సెలవుల పూర్తి వివ‌రాలు ఇవే..
☛ అక్టోబర్ 1: ఆదివారం
☛ అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి
☛ అక్టోబర్ 8: ఆదివారం
☛ అక్టోబర్ 14: రెండవ శనివారం
☛ అక్టోబర్ 14: మహాలయ (కోల్‌కతా)
☛ అక్టోబర్ 15: ఆదివారం
☛ అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)
☛ అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా)
☛ అక్టోబర్ 22: ఆదివారం
☛ అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).
☛ అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)
☛ అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
☛ అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)
☛ అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)
☛ అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్‌కతా)
☛ అక్టోబర్ 28: నాల్గవ శనివారం
☛ అక్టోబర్ 29: ఆదివారం
☛ అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)

#Tags