School Timings : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల ప‌నివేళ్ల‌లో మార్పులు.. ఈనెల 25 నుంచి..

ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్నాయి.

అనంతపురం: కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోనే విద్యాశాఖలో అశాస్త్రీయ నిర్ణయాలు తీసుకుంటూ తిరోగమన విధానాలకు శ్రీకారం చుడుతోందని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. బోధనాసిబ్బందికి చట్టబద్ధంగా సంక్రమించిన క్యాజువల్‌ లీవ్‌ల మంజూరులో నిబంధనలు సృష్టించడం, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్ల పని గంటలను పెంచడం, రెసిడెన్షియల్‌ శిక్షణ, ఉన్నత పాఠశాలల సమయాన్ని పెంచడం తదితర నిర్ణయాలను ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Singareni Schools: సింగరేణి పాఠశాలల్లో ఒలింపియాడ్‌.. మూడు దశల్లో ఒలింపియాడ్‌..

ఈ నెల 25 నుంచే అమలు

ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడుస్తున్నాయి. అయితే పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసిన స్కూళ్లల్లో ఈ నెల 25 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లల్లోనూ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. విద్యారంగంలో వింత పోకడలు అమలు చేస్తే ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉన్నత పాఠశాలల బడి వేళలు మార్చాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

White Coat Ceremony: వైద్య కళాశాలలో వైట్‌కోట్‌ వేడుక

#Tags