Knowledge Center for Students : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం బీవీ రాజు నాలెడ్జ్‌ సెంటర్‌ కృషి..!

విద్యార్థుల కోసం నిర్మించిన ఈ భ‌వ‌నం పేద విద్యార్థుల అభ్యున్నతికి బాటలు వేస్తోంది. ఇందుకు త‌గ్గ కృషి చేస్తున్నారు ఈ సంస్థ అధికారులు..

భీమవరం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విజ్ఞాన జిజ్ఞాసను పెంచేందుకు బీవీ రాజు ఫౌండేషన్‌ నిర్విరామ కృషి చేస్తోంది. సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈ ఫౌండేషన్‌ పేద విద్యార్థుల అభ్యున్నతికి బాటలు వేస్తోంది. సాంకేతికత వైపు వారిని అడుగులు వేయించేందుకు రూ. కోటికి పైగా వెచ్చించి విజ్ఞాన శాస్త్ర పరికరాలతో ఆధునాత ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. సొంత వ్యయంతో నిత్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చి ఆధునిక విజ్ఞానాన్ని అర్థమయ్యే రీతిలో అందిస్తోంది.

సిమెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా చైర్మన్‌గా దేశంలో సిమెంట్‌ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడిన స్వర్గీయ డాక్టర్‌ భూపతిరాజు విస్సంరాజు (బీవీ రాజు) స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చెంతనే ఉన్న కుముదవల్లి. పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆయన సేవలకు పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డులతో సత్కరించింది. డాక్టర్‌ బీవీ రాజు ఫౌండేషన్‌ స్థాపించి తన స్వగ్రామం, భీమవరం ప్రాంత అభివృద్ధికి, పేదల సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చించి ఎనలేని సేవలందించారాయన. విష్ణు విద్యాసంస్థలను స్థాపించి విద్యారంగంలో భీమవరానికి గుర్తింపు తెచ్చారు. ఆయన స్ఫూర్తితో పేద విద్యార్థుల కోసం డాక్టర్‌ బీవీ రాజు ఫౌండేషన్‌, విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ కేవీ విష్ణురాజు 2006లో డాక్టర్‌ బీవీ రాజు నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.

AP DSC -2024 Notification : ఏపీ డీఎస్సీ-2024 పై కీల‌క నిర్ణయం.. జూలై 1వ తేదీ నుంచి..

18 ఏళ్లలో 1,28,991 మందికి శిక్షణ

ఏ రోజు ఏ పాఠశాలలోని ఏ తరగతికి చెందిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చేదీ సంబంధిత హెచ్‌ఎంలతో ముందుగానే మాట్లాడి టైం టేబుల్‌ సిద్ధం చేసుకుని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గత 18 విద్యా సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి 1,28,991 మంది విద్యార్థులకు ల్యాబ్‌లలో శిక్షణ ఇచ్చారు. 10వ తరగతి విద్యార్థులకు నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పరీక్షకు శిక్షణ ఇస్తున్నారు. సిబ్బంది జీతభత్యాలు, విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం, ల్యాబ్‌ల నిర్వహణ, ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రూ.2.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. భీమవరం రూరల్‌ వెంప జెడ్పీ హైస్కూల్‌లోనూ విద్యార్థుల కోసం ఫౌండేషన్‌ ద్వారా రూ.10 లక్షల వ్యయంతో రెండేళ్ల క్రితం ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు.

NEET UG 2024: నీట్‌–యూజీ 2024 రీఎగ్జామ్‌: సగం మంది అభ్యర్థులు డుమ్మా

బాగా చెబుతారు

గత ఏడాది నుంచి ఇక్కడి ల్యాబ్‌కు వస్తున్నాను. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ పుస్తకాల్లోని పాఠాలను ఇక్కడ ప్రయోగాత్మకంగా చాలా బాగా వివరిస్తూ చెబుతారు. కంప్యూటర్‌ కూడా నేర్పిస్తున్నారు.

– కె.అఖిల, 7వ తరగతి, ఏఆర్‌కేఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌, భీమవరం

UTF District Council Meeting : పాఠశాలలో యూటీఎఫ్‌ జిల్లా మధ్యంతర కౌన్సిల్‌ సమావేశం.. విద్యారంగంపై కీల‌క ఆదేశాలు..

తాతయ్య మాకు స్ఫూర్తి

తాతయ్య స్ఫూర్తితో డాక్టర్‌ బీవీ రాజు ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆయన జ్ఞాపకార్థం డాక్టర్‌ బీవీ రాజు నాలెడ్జ్‌ సెంటర్‌ను 18 ఏళ్ల క్రితం ప్రారంభించి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం.

– కేవీ విష్ణురాజు, విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ, డాక్టర్‌ బీవీ రాజు ఫౌండేషన్‌ చైర్మన్‌

TS CPGET 2024: పీజీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల తేదీ ఇదే.. పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి

#Tags