Government Schools Admissions : 'బ‌డిబాట' కార్య‌క్ర‌మంతో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు స‌ర్కారు బ‌డులపై అవ‌గాహ‌న..!

ఈ నెల 19 వరకు సాగిన బడిబాట కార్యక్రమంలో మొత్తం 1512 మందికి నూతనంగా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు..

కొమ‌రం భీం: బడిబాట కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా ముగిసింది. ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందిపడిన ఉపాధ్యాయులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ప్రవేశాలు కల్పించారు. సర్కారు బడుల్లో వసతులను పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ఈ నెల 19 వరకు సాగిన బడిబాట కార్యక్రమంలో మొత్తం 1512 మందికి నూతనంగా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు.

DOST 2024: దోస్త్‌ ద్వారా ప్రవేశాలు...... డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం

అందరి భాగస్వామ్యం..

గత అనుభవాల దృష్ట్యా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మొదట ఈ నెల 3 నుంచి కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించినా.. ఎండలు, ఇతర కారణాలతో 6వ తేదీ నుంచి 19 వరకు చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులతోపాటు జిల్లా అధికారులు సమగ్ర శిక్ష సెక్టోరియల్‌ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అసిస్టెంట్‌ లేబర్‌ అధికారులు, స్టేషన్‌ హౌజ్‌ అధికారులు, ఎన్‌జీవోలు, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు, మహిళా శిశు సంక్షేమశాఖ సూపర్‌వైజర్లు, వీవో సభ్యులను భాగస్వాములను చేశారు.

NEET-UG Row: 'నీట్‌' వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రికి చేదు అనుభవం

జిల్లాలో మొత్తం 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ బడుల్లో అందిస్తున్న ఇంగ్లిష్‌ మీడియం బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌, మధ్యాహ్న భోజనం, వసతుల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రైవేట్‌ పాఠశాలలతోపాటు బడి బయట పిల్లలను సర్కారు బడుల వైపు మళ్లించాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలలపై దృష్టి సారించారు. అక్కడి విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్ల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వివరాలు సేకరించారు. బడిబయట పిల్లలను గుర్తించి నేరుగా అడ్మిషన్లు కల్పించారు.

Skill Development University : స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ యూనివ‌ర్సిటీకి తెలంగాణ సీఎం అంగీకారం.. ఎక్క‌డంటే!

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కీలకపాత్ర

బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో ఇంటింటా విస్తృత ప్రచారం చేశారు. కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే ఎస్‌ఎంసీల స్థానంలో నియమించిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు బడిబాట కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీల ఆధ్వర్యంలోనే పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టడంతోపాటు విద్యార్థులకు యూనిఫాం కుట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పాఠశాలలకు చిన్నారులు వచ్చే విధంగా తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించారు.

Neet Paper Leak Updates: 'నీట్‌' పేపర్‌ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం

పోర్టల్‌లో వివరాల నమోదు

రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా, పట్టణ, గ్రామస్థాయిలో విద్యార్థుల వివరాలను ఉపాధ్యాయులు ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. నూతనంగా అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వచ్చారా..? ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి వచ్చారా.. నేరుగా అడ్మిషన్లు తీసుకున్నారా..? అనే విషయాలను ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు బడిబాట పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీని ద్వారా జిల్లాస్థాయి అధికారులకు మానిటరింగ్‌ చేయడం సులువైంది. జిల్లా విద్యాధికారి పూర్తి వివరాలను రాష్ట్ర పాఠశాల విద్యాధికారులు, ప్రాజెక్టు అధికారులకు నివేధించారు.

Spoken English: కేయూలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు

డ్రాపౌట్స్‌ లేకుండా చర్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాం. వేసవి సెలవుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ లేకుండా చర్యలు చేపడతాం.

–పి.అశోక్‌, జిల్లా విద్యాధికారి

అంగన్‌వాడీ కేంద్రాల నుంచి 1,160

నేరుగా పాఠశాలల్లో అడ్మిషన్లు 157

ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి 152

బడిబయట పిల్లలు 43

Digital Classes For School Students: సర్కారు బడుల్లో అటకెక్కిన డిజిటల్‌ విద్య..

#Tags