Skip to main content

Skill Development University : స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ యూనివ‌ర్సిటీకి తెలంగాణ సీఎం అంగీకారం.. ఎక్క‌డంటే!

నియోజకవర్గాన్ని విద్యాహబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వివ‌రించారు..
Skill development university in Telangana state

ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు వంద ఎకరాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ (వృత్తి నైపుణ్య విశ్వవిద్యాలయం) ఏర్పాటు చేయనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గాన్ని విద్యాహబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆమనగల్లు పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Neet Paper Leak Updates: 'నీట్‌' పేపర్‌ లీకేజీ.. పరీక్షకు 48 గంటల ముందే అమ్మకం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు కోసం అవసరమైన వంద ఎకరాల స్థలాన్ని గుర్తిస్తున్నట్లు చెప్పారు. 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసి అన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఒకేచోట ఏర్పాటు చేస్తామన్నారు.

Spoken English: కేయూలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ తరగతులు

ఆమనగల్లుకు మంజూరైన పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు కోసం అనువైన 5 ఎకరాల స్థలాన్ని సేకరిస్తామని తెలిపారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన అసంపూర్తి పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తెస్తామని, అదే ఆవరణలో డిగ్రీ కళాశాల భవనం నిర్మిస్తామన్నారు. సమావేశంలో వివిధ మండలాల తహసీల్దార్‌లు లలిత, ముంతాజ్‌, రంగారెడ్డి, సుదీర్‌, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Teacher Jobs: ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి

స్థలాల పరిశీలన

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ కోసం కడ్తాల మండలం అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలో సర్వే నెంబర్‌ 321, 260లో ఉన్న ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఆర్డీఓ శ్రీనుతో కలిసి పరిశీలించారు. అన్మాస్‌పల్లి సమీపంలోని ప్రభుత్వ భూములను వెంటనే సర్వే చేయించి నివేదిక అందించాలని తహసీల్దార్‌ ముంతాజ్‌కు సూచించారు. కార్యక్రమంలో కడ్తాల్‌ ఎంపీటీసీ గూడురి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బిచ్చానాయక్‌, నాయకులు గూడురి భాస్కర్‌రెడ్డి, జహంగీర్‌ అలీ, హన్మానాయక్‌, రమేశ్‌, ప్రభు, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Digital Classes For School Students: సర్కారు బడుల్లో అటకెక్కిన డిజిటల్‌ విద్య..

Published date : 22 Jun 2024 09:35AM

Photo Stories