AP Open School Tenth and Inter Admissions 2023 : గుడ్‌న్యూస్‌.. ఇక‌పై ఓపెన్ టెన్త్, ఇంట‌ర్ ప్ర‌వేశాలు స‌చివాల‌యాల్లోనే.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో బ‌డి మానేసిన వారి కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఒక సువ‌ర్ణావ‌కాశం క‌ల్పించింది. చ‌దువుకోవాల‌ని ఆశ ఉన్నా.. వివిధ కారణాల వల్ల బ‌డి ఈడు దాటిపోయిన వారికోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ టెన్త్, ఇంట‌ర్‌కు అవ‌కాశం క‌ల్పిస్తుంది. 14 ఏళ్లు దాటిన వారు నేరుగా అడ్మిష‌న్లు తీసుకుని టెన్త్ లేదా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావ‌చ్చు.
AP Open School Tenth and Inter Admissions 2023

వివిధ కార‌ణాల‌తో బ‌డికి వెళ్ల‌లేక‌పోయినా, చ‌దువు మ‌ధ్య‌లో మానేసిన వారికి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంట‌ర్ మంచి అవ‌కాశంగా అధికారులు చెబుతున్నారు.

☛ NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు.. కార‌ణం ఇదే..

ఎలాంటి చ‌దువులేని వారు కూడా నేరుగా.. ప్ర‌వేశం..
అయితే ఆయా త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ ఆన్‌లైన్‌లో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది. టెన్త్ లేదా ఇంట‌ర్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుని ప్ర‌వేశం తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎలాంటి చ‌దువులేని వారు కూడా నేరుగా ప‌దో త‌ర‌గ‌తి అడ్మిష‌న్ తీసుకోవ‌చ్చు. ఇక టెన్త్ పాస‌యిన వారు ఓపెన్ ఇంట‌ర్ అడ్మిష‌న్ తీసుకునే అవ‌కాశం ఉంది. తాజాగా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంట‌ర్ అడ్మిష‌న్లు తీసుకోనే వారికోసం ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. నేరుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామ‌/వార్డు స‌చివాల‌యాల్లోనే రిజిస్ట‌ర్ చేసుకుని అడ్మిష‌న్ తీసుకునే అవ‌కాశం క‌ల్పించింది.

☛ Tenth and Inter Public Exams : ఇక‌పై.. ఏడాదికి రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలు.. కొత్త‌ రూల్స్ ఇవే..

ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంట‌ర్ ప్ర‌వేశం ఎలా తీసుకోవాలంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంట‌ర్ అడ్మిష‌న్ తీసుకోవ‌ల‌సి ఉంటుంది. దీనికోసం ఓపెన్ స్కూల్ సొసైటీ వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
ఈ విద్యాసంవత్స‌రంలో ఇప్ప‌టికే ప్ర‌వేశాల ప్ర‌క్రియ ప్రారంభం అయింది. ఎలాంటి అద‌న‌పు ఫీజు లేకుండా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెస్టెంబ‌ర్ 15 వ తేదీ వ‌ర‌కూ గ‌డువు ఉంది. అద‌న‌పు రుసుంతో క‌లిపి అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కూ అడ్మిష‌న్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..
అయితే ఇప్ప‌టివ‌ర‌కూ కాస్త కంప్యూట‌ర్ నాలెడ్జి ఉన్న‌వారు మాత్ర‌మే అడ్మిష‌న్ల కోసం నేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు. మిగిలిన వారు ఇంట‌ర్ నెట్ సెంట‌ర్ కు వెళ్లాల్సి వ‌చ్చేది. అయితే ఈ ఏడాది నుంచి ఏపీ గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల్లో కూడా అడ్మిష‌న్లు పొందేలా ఏర్పాట్లు చేసారు. దీని కోసం గ్రామ, వార్డు స‌చివాల‌యాల శాఖ‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక పీఠం ఒప్పందం చేసుకుంది. సార్వ‌త్రిక పీఠం ద్వారా ప‌దో త‌ర‌గ‌తి,టెన్త్ అడ్మిష‌న్లు తీసుకోవాల‌నుకునే వారు ద‌గ్గ‌ర్లోని గ్రామ లేదా వార్డు స‌చివాల‌యానికి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని అధికారులు తెలిపారు.

ఓపెన్ టెన్త్, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల కోసం మొద‌టిసారి ఆన్ లైన్‌లో ఫ్రీ కోచింగ్

ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ అడ్మిష‌న్ల‌ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత ఆన్ లైన్ లోనే వాటిని ప‌రిశీలించి అర్హులైన వారికి అడ్మిష‌న్లు ఇస్తారు. ఇలా అడ్మిష‌న్లు పొందిన వారికోసం ఈ ఏడాది ఓపెన్ స్కూల్ సొసైటీ అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లో  ఆన్‌లైన్ పాఠాల బోధ‌న వీడియోల‌ను ఉంచ‌నున్న‌ట్లు సార్వ‌త్రిక పీఠం అధికారులు తెలిపారు. ఈ పాఠాల‌ను నేర్చుకోవ‌డం ద్వారా ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకావ‌డం సులువుగా ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్

#Tags