Infosys Scholarship 2024-25: ఇన్ఫోసిస్‌ స్కాలర్‌షిప్‌కు అప్లై చేశారా? మీకు ఈ అర్హతలు ఉంటే చాలు..

ప్రముఖ విద్యాసంస్థల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమ్యాటిక్స్‌ (స్టెమ్‌) విభాగాల్లో కోర్సులు చేస్తున్నారా? మీలాంటి ప్రతిభావంతులైన విద్యార్థినులకు ప్రముఖ టెక్‌ దిగ్గజ​ం ఇన్ఫోసిస్‌ ‘స్టెమ్‌ స్టార్‌’ పేరుతో స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. ట్యూషన్‌ ఫీజు, వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్‌ ఇలా అన్నింటికీ కలిపి ఏడాదికి లక్ష రూపాయల చొప్పున నాలుగేళ్లు ఆర్థిక సాయాన్ని అందించనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చదివేయండి. 
Infosys Scholarship 2024-25

అర్హత: భారత పౌరులై ఉండాలి. 
బీటెక్‌/ఎంబీబీఎస్‌/బీఫార్మసీ/బీడీఎస్‌ లేదా (B.Tech + M.Tech) వంటి ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసి ఉండాలి

టాప్‌ కాలేజీల్లో చదువుతున్నవారు:

  • ఇంజనీరింగ్: NIRF టాప్ 300 ఇంజనీరింగ్ కాలేజీలు (2023 లేదా 2024)
  • వైద్య శాస్త్రాలు: NIRF టాప్ 50 మెడికల్ కాలేజీలు (2023 లేదా 2024)
  • ఫార్మసీ: NIRF టాప్ 100 ఫార్మసీ కాలేజీలు (2023 లేదా 2024)
  • డెంటల్: NIRF టాప్ 40 డెంటల్ కాలేజీలు(2023 లేదా 2024)
  • యూనివర్సిటీ: NIRF టాప్ 100 యూనివర్సిటీలు(2023 లేదా 2024)లలో చదువుతున్నవారు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 

Bharat Electronics Limited Recruitment: బీటెక్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.లక్షన్నరకు పైనే జీతం

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉండాలి
  • మీరే ఇతర స్కాలర్‌షిప్‌ అందని వారు అప్లై చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: నవంబర్‌ 25, 2024

AP 10th Class Exam Fees: ఏపీ పదో తరగతి పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags