RRB Jobs Notification 2024 Details : శుభ‌వార్త‌.. 9,144 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుద‌ల‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (RRB) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో 9,144 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

వీటిల్లో టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ పోస్టులు 1092 ఉండగా.. టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలు 8,052 వరకు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 8, 2024వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా 21 ఆర్ఆర్‌బీ రీజియన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హ‌త‌లు ఇవే..
☛ టెక్నీషియన్ గ్రేడ్-I.. సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, డిప్లొమా (ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణలై ఉండాలి.

☛ టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకైతే.. మెట్రిక్యులేషన్ లేదా ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐలో (ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ జనరల్, మెషినిస్ట్, కార్పెంటర్, ఆపరేటర్ అడ్వాన్స్‌డ్ మెషిన్ టూల్, మెషినిస్ట్, మెకానిక్ మెకానిక్, మెకానిక్ మెకాట్రానిక్స్‌, మెకానిక్ డీజిల్‌, మెకానిక్ మోటార్ వెహికిల్, టర్నర్, ఆపరేటర్ అడ్వాన్స్‌డ్‌ మెషిన్ టూల్, గ్యాస్ కట్టర్, హీట్ ట్రీటర్, ఫౌండ్రీమ్యాన్, ప్యాటర్న్ మేకర్, మౌల్డర్ తదితర బ్రాంచ్‌లలో ఏదైనా ఒకదానిలో ఉత్తీర్ణత) లేదా 10+2 (ఫిజిక్స్, మ్యాథ్స్‌) లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.

చదవండి: SSC Recruitment 2024: ఎస్‌ఎస్‌సీ-కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2049 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

వయోపరిమితి :
☛ జులై 1, 2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు నిండి ఉండాలి. 
☛ టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇక ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు ఫీజు :
దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికోద్యోగులు/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులు రూ.500 చొప్పున చెల్లించాలి. 

దరఖాస్తు విధానం ఇలా..
☛ అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్​సైట్​ https://www.rrbapply.gov.in/ ఓపెన్ చేయాలి.
☛ వెబ్​సైట్​లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి.
☛ తరువాత మీ ఈ-మెయిల్, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి.
Apply Online-Recruitment of Technician 2024 లింక్​పై క్లిక్ చేయాలి.
☛ దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసుకోవాలి.
☛ మీ ఫొటో, సిగ్నేచర్ సహా, ముఖ్యమైన పత్రాలు అన్నీ అప్లోడ్​ చేయాలి.
☛ దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లో చెల్లించాలి.
☛ అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ఎంపిక విధానం : 
ఈ ఉద్యోగాల‌ను కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం : 
ఎంపికైతే నెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 జీతంగా చెల్లిస్తారు.

ఆర్‌ఆర్‌బీ రీజియన్ వారీగా పోస్టుల వివరాలు ఇలా..

ఆర్‌ఆర్‌బీ అహ్మదాబాద్ పోస్టులు: 761
ఆర్‌ఆర్‌బీ అజ్‌మేర్ పోస్టులు: 522
ఆర్‌ఆర్‌బీ బెంగళూరు పోస్టులు: 142
ఆర్‌ఆర్‌బీ భోపాల్ పోస్టులు: 452
ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్ పోస్టులు: 150
ఆర్‌ఆర్‌బీ బిలాస్‌పూర్ పోస్టులు: 861
ఆర్‌ఆర్‌బీ చండీగఢ్ పోస్టులు: 111
ఆర్‌ఆర్‌బీ చెన్నై పోస్టులు: 833
ఆర్‌ఆర్‌బీ గువాహటి పోస్టులు: 624
ఆర్‌ఆర్‌బీ జమ్ము అండ్‌ శ్రీనగర్ పోస్టులు: 291
ఆర్‌ఆర్‌బీ కోల్‌కతా పోస్టులు: 506
ఆర్‌ఆర్‌బీ మాల్దా పోస్టులు: 275
ఆర్‌ఆర్‌బీ ముంబయి పోస్టులు: 1284
ఆర్‌ఆర్‌బీ ముజఫర్‌పూర్ పోస్టులు: 113
ఆర్‌ఆర్‌బీ పట్నా పోస్టులు: 221
ఆర్‌ఆర్‌బీ ప్రయాగ్‌రాజ్ పోస్టులు: 338
ఆర్‌ఆర్‌బీ రాంచీ పోస్టులు: 350
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ పోస్టులు: 744
ఆర్‌ఆర్‌బీ సిలిగురి పోస్టులు: 83
ఆర్‌ఆర్‌బీ తిరువనంతపురం పోస్టులు: 278
ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్‌ పోస్టులు: 205
మొత్తం పోస్టుల సంఖ్య: 9,144

☛ SSC CPO Notification 2024: కేంద్ర సాయుధ దళాల్లో 4,187 ఎస్‌ఐ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags