Railway Recruitment Cell : సదరన్‌ రైల్వేలో ట్రేడ్‌ అప్రెంటీస్ పోస్టులు.. వివ‌రాలు ఇలా..!

చెన్నైలోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌.. సదరన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌లు /వర్క్‌షాప్‌లు/యూనిట్లలో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 2,438.
 యూనిట్ల వారీగా ఖాళీల వివరాలు
»    సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ వర్క్‌షాప్‌/పొదనూర్, కోయంబత్తూర్‌–18 ఖాళీలు, క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ వర్క్స్‌/పెరంబూర్‌–47, రైల్వే హాస్పిటల్‌ /పెరంబూర్‌(మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌)–20, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ వర్క్‌షాప్‌/పొదనూర్, కోయంబత్తూర్‌–52, తిరువనంతపురం డివిజన్‌–145, పాలక్కడ్‌ డివిజన్‌–285, సేలం డివిజన్‌–222, క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌ వర్క్స్‌/పెరంబూర్‌–350, లోకో వర్క్స్‌/పెరంబూర్‌–228, ఎలక్ట్రికల్‌ వర్క్‌షాప్‌/పెరంబూర్‌–130, ఇంజనీరింగ్‌ వర్క్‌షాప్‌/అరక్కోణం–48, చెన్నై డివిజన్‌/పర్సనల్‌బ్రాంచ్‌–24, చెన్నై డివిజన్‌ –ఎలక్ట్రికల్‌/రోలింగ్‌ స్టాక్‌/అరక్కోణం–65, చెన్నై డివిజన్‌–ఎలక్ట్రికల్‌/రోలింగ్‌ స్టాక్‌/ఆవడి–65, చెన్నై డివిజన్‌–ఎలక్ట్రికల్‌/రోలింగ్‌ స్టాక్‌/తాంబరం–55, చెన్నై డివిజన్‌–ఎలక్ట్రికల్‌/రోలింగ్‌ స్టాక్‌/రోయపురం–30, చెన్నై డివిజన్‌ –మెకానికల్‌ (డీజిల్‌)–22, చెన్నై డివిజన్‌–మెకానికల్‌(క్యారేజ్‌ అండ్‌ వ్యాగన్‌)–250, చెన్నై డివిజన్‌–రైల్వే హాస్పిటల్‌ (పెరంబూర్‌)–03, సెంట్రల్‌ వర్క్‌షాప్‌లు, పొన్మలై–201, తిరుచ్చిరాపల్లి డివిజన్‌–94, మధురై డివిజన్‌–84 ఖాళీలు ఉన్నాయి.
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: 18.07.20 నాటికి ఫ్రెషర్లు 15 నుంచి 22 ఏళ్లు, ఎక్స్‌–ఐటీఐ/ఎంఎల్‌టీ అభ్యర్థులకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.08.2024
»    వెబ్‌సైట్‌: https://sr.indianrailways.gov.in

August 9th Holiday 2024 : ఆగ‌స్టు 9వ తేదీన సెలవు.. సీఎంకి వినతి.. ఎందుకంటే..?

#Tags