IRCON Recruitment 2024: ఇర్కాన్ లో ఫైనాన్స్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.45,000 జీతం..

న్యూఢిల్లీలోని ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌(ఇర్కాన్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: బీకాం/ఎంకాం/సీఏ(ఇంటర్‌)/సీఎంఏ(ఇంటర్‌) ఉత్తీర్ణతతో పాటు అకౌంటింగ్, ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఫైలింగ్‌ ఆఫ్‌ రిటర్న్‌ తదితర విభాగాల్లో నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.45,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జేజీఎం/హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, సీ–4, డిస్ట్రిక్ట్‌ సెంటర్, సాకేట్, ఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.03.2024.

వెబ్‌సైట్‌: https://www.ircon.org/

చదవండి: 2860 Railway Jobs: దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags