Certificate Course: మహిళలకు ఉచితంగా నాన్‌ వాయిస్‌ సర్టిఫికెట్‌ కోర్సు..

Certificate Course

నెల్లూరు (టౌన్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ ఆధ్వర్యంలో స్థానిక డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఈ నెల 4వ తేదీ నుంచి కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ డొమెస్టిక్‌ నాన్‌ వాయిస్‌ సర్టిఫికెట్‌ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ గిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో 30 సీట్లు ఉన్నాయన్నారు.

Free Training: నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉపాధి కోర్సులలో శిక్షణ

ఈ కోర్సులో చేరేందుకు 10వ తరగతి లేదా ఆపైన కోర్సులు చదివి ఉండి వయస్సు 18 నుంచి 35 ఏళ్ల లోపు మహిళలు అర్హులన్నారు. ఈ కోర్సుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ కోర్సులో చేరేందుకు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags