CMAT 2025 Notification : ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలకు సీమ్యాట్ 2025 నోటిఫికేషన్..
ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా దాదాపు వేయి ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏ తదితర మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఎన్‌టీఏ ప్రతి ఏటా సీమ్యాట్‌ను నిర్వహిస్తోంది. తాజాగా సీమ్యాట్–2025కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. సీమ్యాట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ తదితర వివరాలు..
బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది లక్ష్యం మేనేజ్‌మెంట్ పీజీ. ఇందుకోసం ఐఐఎంల్లో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ మొదలు రాష్ట్ర స్థాయిలోని ఉమ్మడి ఎంట్రన్స్‌ల వరకూ.. ఎన్నో ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ అందుబాటులో ఉండే సీట్లు, పోటీ కారణంగా అందరికీ సీట్లు లభించకపోవచ్చు. ఇలాంటి వారికి మెరుగైన ప్రత్యామ్నాయం సీమ్యాట్. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఎంబీఏ కళాశాలల్లో అడ్మిషన్ లభిస్తుంది.
Non Executive Posts : మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌లో 234 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
నిర్వహణ.. ఎన్‌టీఏ
సీమ్యాట్‌ను 2018 వరకు ఏఐసీటీఈ సొంతంగా నిర్వహించేది. 2019 నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతోంది. ఫలితాల అనంతరం విద్యార్థులు ఆయా ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు
బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
400 మార్కులకు పరీక్ష
సీమ్యాట్‌ను మొత్తం అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ 20 ప్రశ్నలు–80 మార్కులు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలు–80 మార్కులు, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ 20 ప్రశ్నలు–80 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు–80 మార్కులకు, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ 20 ప్రశ్నలు–80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మొత్తం మూడు గంటల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది.
NIFT Admissions : నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు
వేయికిపైగా ఇన్‌స్టిట్యూట్‌లు
సీమ్యాట్–2025 స్కోర్‌ను దేశవ్యాప్తంగా వేయికి పైగా ఇన్‌స్టిట్యూట్‌లు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సదరు ఇన్‌స్టిట్యూట్‌ల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(పీజీపీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు సీమ్యాట్ స్కోరుతో ప్రవేశం పొందొచ్చు. క్యాట్‌లో మంచి ర్యాంకు దక్కని విద్యార్థులకు సీమ్యాట్ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
మలి దశ ఎంపిక ప్రక్రియ
సీమ్యాట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు.. మలిదశలో ప్రత్యేక ఎంపిక ప్రక్రియను అనుసరిస్తున్నాయి. ఆయా కాలేజీలు సీమ్యాట్‌లో పొందాల్సిన కనీస స్కోర్‌ను నిర్దేశిస్తున్నాయి. ఆ స్కోర్ సాధించిన వారు ఎంబీఏలో అడ్మిషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
జీడీ, పీఐలు
పలు ఇన్‌స్టిట్యూట్‌లు మలిదశలో గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వూ్వ(పీఐ) నిర్వహిస్తున్నాయి. వీటిలో చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, సీమ్యాట్ స్కోర్‌కు వెయిటేజీ కల్పించి ప్రవేశాలు ఖరారు చేస్తున్నాయి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు నేరుగా సీమ్యాట్ స్కోర్ ఆధారంగా కనీస కటాఫ్‌ను నిర్దేశించి ఫైనల్ మెరిట్ లిస్ట్ రూపొందించి సీట్ల భర్తీ చేస్తున్నాయి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024,డిసెంబర్13
దరఖాస్తు సవరణ అవకాశం: 2024, డిసెంబర్ 15 నుంచి 17 వరకు
సీమ్యాట్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ సదుపాయం: 2025 జనవరి 20
సీమ్యాట్ తేదీ: 2025, జనవరి 25
పూర్తివివరాలకు వెబ్‌సైట్: https://exams.nta.ac.in/CMAT
Indian Geography Bit Bank: భారతదేశం ఏ నిల్వలను అధికంగా కలిగి ఉంది?
రాత పరీక్షలో రాణించేలా
క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
అభ్యర్థుల్లోని గణిత, డేటా విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. ఇందులో మంచి స్కోర్ సాధించాలంటే.. అర్థమెటిక్–రేషియోస్, మిక్చర్స్–అలిగేషన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ స్పీడ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంటరెస్ట్, బేసిక్ స్టాటిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా నెంబర్ ప్రాపర్టీస్, ప్రాబబిలిటీ, కౌంటింగ్ ప్రిన్సిపల్స్, జామెట్రీ, డెరివేటివ్స్ (మ్యాగ్జిమా–మినిమా) వంటి ప్యూర్ మ్యాథ్స్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు సంబంధించి టేబుల్ అండ్ పై ఛార్ట్స్, బార్ డయాగ్రమ్స్ అండ్ గ్రాఫ్స్, ఛార్ట్స్‌లను పరిశీలించడం, వాటిలోని గణాంకాలను విశ్లేషించడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకునేలా ప్రిపరేషన్ సాగించాలి.
లాజికల్ రీజనింగ్
ఈ విభాగం కోసం లీనియర్, సీటింగ్, సీక్వెన్సింగ్ అండ్ అరేంజింగ్ విత్ కండిషన్స్ టు కోడింగ్ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. స్టేట్‌మెంట్–కంక్లూజన్, లాజికల్ పజిల్, న్యూమరికల్ పజిల్, వెన్ డయాగ్రమ్, ట్రూ–ఫాల్స్ స్టేట్‌మెంట్స్, విజువల్ రీజనింగ్ టాపిక్స్‌పై ప్రత్యేక దృష్టితో ప్రాక్టీస్ చేయాలి. ఇందుకోసం క్యాట్, ఎక్స్‌ఏటీ తదితర పరీక్షల పూర్వ ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
PG Spot Admissions : అంబేడ్కర్ వర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిషన్లు.. లభించిన స్పందన మాత్రం..
లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్
అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ నాన్ ఫెనైట్స్, డాంజ్లింగ్ మాడిఫైర్, యూసేజ్ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్, ఆడ్జెక్టివ్స్, ఆడ్ వెర్బ్స్, ప్రిపోజిషన్స్–రెగ్యులర్, ఫాలోవుడ్, సింటాక్స్, సబ్జెక్ట్–వెర్బ్ అరేంజ్‌మెంట్, సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ టెన్సెస్ అండ్ కండిషనల్ అన్‌రియల్ పాస్ట్, జంబల్డ్ పారాగ్రాఫ్స్ వంటి అంశాలపై పట్టు సాధించడం ద్వారా మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజెస్ కూడా ఈ విభాగంలో ఉంటాయి. 500 నుంచి 600 పదాలతో పాసేజ్‌లు ఇస్తారు. తర్వాత పాసేజ్‌కు సంబంధించిన ఇంటర్‌ఫియరెన్స్ డ్రాన్, సెంట్రల్ ఐడియా, ఫ్రేజెస్, ఇడియమ్స్, తదితరాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలను రోజూ చదువుతూ వొకాబ్యులరీ పెంచుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్‌పై పట్టుసాధించాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ నాలెడ్జ్, సమకాలీన అంశాలపై అవగాహనను పరీక్షించే విభాగం ఇది. స్టాండర్డ్ జీకే బుక్స్, న్యూస్ పేపర్లు్ల, వీక్లీలు, వెబ్‌సైట్స్, పిరియాడికల్స్‌ను ఫాలో అవ్వాలి. వీటితోపాటు బిజినెస్, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, భారత రాజ్యాంగం, వివిధ దేశాలు–కరెన్సీలు, భారతదేశం–రాష్ట్రాలు, అంతర్జాతీయ సంస్థలు, ద్రవ్య, కోశ గణాంకాలు, ఇటీవల చోటు చేసుకుంటున్న సమకాలీన పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలు మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కీలకమని భావించి ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారని చెప్పొచ్చు. అభ్యర్థులు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించిన టెక్నికల్ టెర్మినాలజీ (సీడ్ ఫండింగ్, క్రౌడ్ ఫండింగ్, ఏంజెల్ ఇన్వెస్టర్స్ తదితర) పై అవగాహన పొందాలి. స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి పథకాల లక్ష్యాలు, వాటి ప్రస్తుత పరిస్థితులపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.
250–350 స్కోర్ సాధించేలా
సీమ్యాట్ ద్వారా టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు 300 నుంచి 350 మార్కులు సాధించేలా కృషి చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. గత రెండేళ్ల ఫైనల్ మెరిట్ లిస్ట్‌లను పరిగణనలోకి తీసుకుంటే.. 300కు పైగా స్కోర్ సాధించిన అభ్యర్థులు వేయికి పైగా ఉండగా, 250 నుంచి 300 మధ్యలో స్కోర్ సాధించిన అభ్యర్థుల సంఖ్య దాదాపు 10వేలుగా ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ శ్రేణిలో స్కోర్ సాధించేలా కృషి చేస్తే టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం ఖరారు చేసుకునే అవకాశం ఉంది.
Pamban Bridge: ఇంజినీరింగ్ అద్భుతం.. అధునాతన సాంకేతికతతో కొత్త రైల్వే బ్రిడ్జి