Apply For 50,000 Govt Job Vacancies: భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. మొత్తం ఖాళీలు, చివరి తేదీ వివరాలివే..

ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు, పెన్షన్‌లు.. ఇలా పలు సౌకర్యాలు లభిస్తుండటంతో ఏ చిన్న పాటి నోటిఫికేషన్‌ వెలువడినా లక్షల్లో పోటీ కనిపిస్తుంటుంది.  ఈ మధ్యకాలంలో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. సుమారు 50 వేలకు పైగానే ఉద్యోగాలకు పలు ప్రభుత్వ రంగ సంస్థలు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. కొన్ని పోస్టులకు సెప్టెంబర్‌ నెలతో డైడెలైన్‌ పూర్తి కానుంది. ఈ క్రమంలో ఏఏ డిపార్ట్‌మెంట్స్‌లో ఎన్ని ఖాళీలున్నాయి? వంటి వివరాలను తెలుసుకొని గడువు తీరకముందే ఆ ఉద్యోగాలకు మీరూ అప్లై చేసేయండి. 


SSC GD 2024 రిక్రూట్‌మెంట్‌
స్టాఫ్‌ సెలక్షన్‌  కమిషన్‌ (ssc)కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF),ఎస్‌ఎస్‌ఎఫ్‌,నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఇలా పలు విభాగాల్లో 39,481 పోస్టులు ఉన్నాయి. వాటి వివరాలను ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.inలో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్‌ 14 వరకు డెడ్‌లైన్‌ విధించింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోండి. 

ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)సర్వీసెస్‌లో కానిస్టేబుల్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం 819 ఖాళీలున్నాయి. వాటిలో పురుషులకు 697 పోస్టులు, మహిళలకు 122 పోస్టులున్నాయి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ఏస్తారు. ఈ పోస్టులకు అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ recruitment.itbpolice.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

BHEL Apprentice Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

ఇండియన్‌ నేవీ రిక్రూట్‌మెంట్‌
ఇండియన్‌ నేవీ.. సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ మెడికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 12వ తరగతి అర్హతతో పాటు వయస్సు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న అవివాహిత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణ సమయంలోస్టైఫండ్‌, ట్రైనింగ్‌ తర్వాత వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 17 లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ joinindiannavy.gov.inను సంప్రదించండి. 

CISF కానిస్టేబుల్/ఫైర్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2024
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)..కానిస్టేబుల్/ఫైర్ మ్యాన్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో మొత్తం 1130 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ cisfrectt.cisf.gov.inలోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు చివరి తేదీ సెప్టెంబర్‌ 30. 

NEET UG 2024 Counselling: నీట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు.. తెలంగాణ, ఏపీకు ఎన్ని సీట్లంటే..

ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2024
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద మొత్తం 11, 558 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ స్థాయిలో వివిధ ఖాళీలున్నాయి. RRB NTPC 2024 గ్రాడ్యుయేట్‌ లెవల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్‌ 14 నుంచి మొదలవుతుంది. అక్టోబర్‌ 13తో గడువు ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

Job Mela In Government Polytechnic College: గుడ్‌న్యూస్‌, రేపు జాబ్‌మేళా.. నెలకు రూ.20వేల వేతనం

ఏఏ విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయంటే..

  • SSC GD రిక్రూట్‌మెంట్- 39,481 పోస్టులు
  • RRB NTPC రిక్రూట్‌మెంట్- 11,588 పోస్టులు
  • ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్- 819 పోస్టులు
  • ఇండియన్ నేవీ SSR మెడికల్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్-  పోస్టుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు
  • CISF కానిస్టేబుల్/ఫైర్‌మెన్ రిక్రూట్‌మెంట్- 1130 పోస్టులు

 

#Tags