CBSE Recruitment 2025: Inter అర్హతతో సీబీఎస్‌ఈలో 212 గ్రూప్–బి, గ్రూప్–సి ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 212
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్–142, జూనియర్ అసిస్టెంట్–70.
అర్హత: 12వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: సూపరింటెండెంట్ పోస్టుకు 30 ఏళ్లు ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: సూపరింటెండెంట్ పోస్టుకు టైర్–1, టైర్–2 పరీక్షలు ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు టైర్–1 పరీక్ష మాత్రమే ఉంటుంది.
సూపరింటెండెంట్: టైర్–1, టైర్–2 పరీక్షలు ఉంటాయి. టైర్–1 ఓఎంఆర్ షీట్ ఆధారంగా పరీక్ష జరుగుతుంది. మొత్తం 450 మార్కులకు 150 మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలేటికల్ ఎబిలిటీ, అర్థమేటికల్–న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు టైర్–2 పరీక్ష రాస్తారు. టైర్–2 ఆబ్జెక్టివ్ టైప్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. మొత్తం 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
జూనియర్ అసిస్టెంట్: ఓఎంఆర్ ఆధారంగా పరీక్ష జరుగుతుంది. టైర్–1 పరీక్ష మొత్తం 300 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ అండ్ మ్యాథమేటికల్ ఎబిలిటీ, జనరల్ హిందీ అండ్ ఇంగ్లిష్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్, స్కూల్ ఎడ్యుకేషన్, ఎగ్జామినేషన్ బోర్డ్, అడ్మినిస్ట్రేషన్ వంటి అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష మాధ్యమం ఇంగ్లిష్, హిందీ. పరీక్ష సమయం రెండు గంటలు. ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్(టైపింగ్ పరీక్ష) ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది: 02.01.2025.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.01.2025.
వెబ్‌సైట్: https://www.cbse.gov.in
>> 15000 Jobs: మెగా జాబ్‌మేళా.. 50 కంపెనీలు.. పూర్తి వివరాలివే!
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |