NEET-UG re-exam 2024 result: నీట్-యూజీ రీ టెస్ట్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: నీట్ యూజీ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్ స్కోర్ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.నీట్ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు.
Also Read : Upcoming Government Exam Dates (As of July 1, 2024)
వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్ కీ, ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్‌సైట్‌లో ఉంచింది.