NEET UG Counselling 2024: నీట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తు తేదీ పొడిగింపు, ఫలితాలు ఎప్పుడంటే..

NEET UG Counselling 2024

నీట్‌ యూజీ- 2024 రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిస్ట్రేషన్‌ గడువును పొడిగించారు.దీని ప్రకారం.. అభ్యర్థులకు నేడు(సెప్టెంబర్‌)మధ్యాహ్నం వరకు ఆప్షన్స్‌ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) తెలిపింది.

Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. వెయ్యికి పైగా ఉద్యోగాలు

కాగా ఈ ఏడాది మొత్తం 400 మెడికల్‌ కాలేజీలకు అనుమతి లభించడంతో ఆ సీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నీట్‌ తొలి రౌండ్‌లో సీటు రాని వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Medical Counseling: సకాలంలో మెడికల్‌ కౌన్సెలింగ్‌ పూర్తి.. కళాశాలల వివరాలు, సీట్ల వివరాలు కోసం క్లిక్ చేయండి

విద్యార్థులకు అధికారిక MCC వెబ్‌సైట్ mcc.nic.inలో  రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 19న సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడవుతాయి. సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో చేరి రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 

NEET UG 2024.. కౌన్సెలింగ్‌ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ mcc.nic.in ను క్లిక్‌ చేయండి. 
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న ‘UG Medical’ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  • మీ నీట్‌ యూజీ రూల్‌నెంబర్‌, పాస్‌వర్డ్‌ వివరాలను ఎంటర్‌ చేయండి
  • రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక సబ్‌మిట్‌ చేయండి
  • రిజిస్ట్రేషన్‌ ఫీజును డెబిట్‌ కార్డ్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా పే చేయండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

#Tags