KNRUHS: పీజీ వైద్య విద్య తొలి విడత వెబ్ కౌన్సెలింగ్
పీజీ వైద్య విద్య మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు Kaloji Narayana Rao University of Health Sciences అక్టోబర్ 17న ఒక ప్రకటనలో తెలిపింది.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలోని యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
చదవండి: NMC: గ్రామాల్లో కుటుంబాలను దత్తత తీసుకోనున్న వైద్య విద్యార్థులు
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.
చదవండి:
High Court: ఇన్‌సర్వీస్ కోటా వర్తిస్తుంది
కారణాలేంటో తెలియజేయండి.. ఈ మార్కుల తగ్గింపుపై ఎన్‌టీఏకు హైకోర్టు ఆదేశం
#Tags