High Court: ఇన్‌సర్వీస్ కోటా వర్తిస్తుంది
ఈ మేరకు 2021, నవంబర్ 18న ఈ జీవోను విడుదల చేసినట్లు పేర్కొంది. మెడికల్ పీజీ కౌన్సెలింగ్‌లో అర్హులైన అభ్యర్థులు ఆ కోటా పొంద వచ్చని వివరించింది. గత విచారణ సందర్భంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పీజీ కనీ్వనర్ సీట్ల కేటాయింపులో ఇన్ సరీ్వస్ కోటాకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
చదవండి: కారణాలేంటో తెలియజేయండి.. ఈ మార్కుల తగ్గింపుపై ఎన్‌టీఏకు హైకోర్టు ఆదేశం
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వైద్య విధాన పరిషత్ ఇన్ సరీ్వస్ సర్టిఫికెట్లు ఇస్తుంది. తమకు ఇన్ సర్వీస్ సరి్టఫికెట్లు ఉన్నా పీజీ సీట్ల కేటాయింపులో కోటా వర్తింపజేయడం లేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం అక్టోబర్ 12న విచారణ చేపట్టింది.
చదవండి: High Court: హారిజంటల్‌గా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ల అర్హతను పరిశీలించి ఆ మేరకు కోటా వర్తింపజేయాలని ఆరోగ్య యూనివర్సిటీని ఆదేశించింది. వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు నేటి నుంచి వారం రోజుల సమయం ఇవ్వాలని స్పష్టం చేసింది.