High Court: హారిజంటల్‌గా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి
ఉద్యోగ భర్తీ ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి 503 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మహిళా కోటాకు సంబంధించి విడిగా రిజర్వేషన్ ఇవ్వడం సరికాదని.. హారిజంటల్ రిజర్వేషన్ (ఓసీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా మహిళల విభజన) విధానాన్నే పాటించేలా TSPSCకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కొడేపాక రోహిత్‌తో పాటు మరికొందరు Group I అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవిదేవీ సెప్టెంబర్ 23న విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది చంద్రయ్య సుంకర వాదనలు వినిపించారు. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఏవిధమైన అభ్యంతరం లేదని, అయితే, అవి కాకుండా మహిళలకు విడిగా రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదన్నారు. రాజేశ్‌కుమార్ దానియా వర్సెస్ రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సుప్రీంకోర్టు ఉత్త ర్వులకు విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ఎక్కువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే నేరుగా మహిళా రిజర్వేషన్లకు వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. గ్రూప్–1లో మహిళా కోటా పోస్టుల భర్తీని హారిజంటల్‌గానే నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 1కు వాయిదా వేశారు. ఆర్టికల్ 16(4) ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ‘వర్టికల్ రిజర్వేషన్’ అని.. వికలాంగులు, మహిళలు తదితర కోటాను ఆర్టికల్ 16(1) కింద ‘హారిజంటల్ రిజర్వేషన్’గా పరిగణిస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్