NEET UG Row: నీట్‌ పేపర్ లీక్‌ కేసు.. నలుగురు విద్యార్థులపై సీబీఐ విచారణ

పట్నా: నీట్‌ పేపర్‌ లీక్‌, నిర్వహణలో అవకతవకలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.  ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా  గురువారం సీబీఐ అధికారులు నలుగురు పట్నా ఎయిమ్స్‌ విద్యార్థులను అదుపులోకి తీసుకుంది. పేపర్‌ లీక్‌కు సంబంధించి వారిని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ  సందర్భంగా పట్నా ఎయిమ్స్‌ డైరెక్టర్ బీజే పాల్ మీడియాతో మాట్లాడారు.

‘సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్న నలుగురు విద్యార్థులు  విచారణకు సహకరిస్తున్నారు. సీబీఐ విచారణ నుంచి విద్యార్థులు ఇంకా తిరిగి  రాలేదు. సీబీఐ విచారణ చేస్తున్న విద్యార్థులు చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను, కరణ్.  ముందుగా ఇన్‌స్టిట్యూట్‌కు సీబీఐ అధికారులు సమాచారం అందించి..  నలుగురు విధ్యార్థులను వారి  హాస్టల్‌ నుంచి  అదుపులోకి తీసుకున్నారు. నీట్‌ పేపర్‌ లీవ్‌ విషయంలో వారిని విచారణ చేసేందుకు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు’ అని  తెలిపారు.

NEET 2024 Supreme Court Live Updates: అప్పుడే నీట్‌ పరీక్షను రద్దు చేస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విచారణలో భాగంగా విద్యార్థుల రూంలను అధికారులు సీజ్‌ చేశారు. ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌,డీన్ సమక్షంలో  సీబీఐ టీం విద్యార్థుల ఫోటోలు , మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఇక జూలై 17  పేపర్ లీక్‌ ప్రధాన నిందితుడు పంకజ్‌ త్రిపాఠి, అతని సహాయకుడు రాజు సింగ్‌ను సీబీఐ అధికారులు జార్ఖండ్‌లోని  హజారీబాగ్‌లో అరెస్ట్‌ చేశారు.  

NEET Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో ముగ్గురు ఎయిమ్స్‌ వైద్యుల అరెస్ట్‌

ఇటీవల పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏ ట్రంక్‌ పెట్టె నుంచి నీట్‌ పేపర్‌ దొంగిలిచిన ఇద్దరిని కూడా సీబీఐ అరెస్ట్‌ చేసింది.మరోవైపు.. ప్రధాన నిందితుడు పంకజ్‌ త్రిపాఠికీ సీబీఐ ప్రత్యేక  కోర్టు.. 14రోజుల సీబీఐ కస్టడీ, అతని సహాయకుడు రాజు సింగ్‌కు 10 రోజుల కస్టడీని విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో  సీబీఐ అధికారులు 14 మందిని అరెస్ట్‌ చేశారు.

#Tags