Skip to main content

AP & TS NEET UG Cutoff Marks 2024 : ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ -2024 కటాఫ్‌ మార్కులు ఇవే.. కౌన్సెలింగ్ తేదీలు ఇవే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : జాతీయ స్థాయిలో నీట్ యూజీ-2024 ర్యాంక్‌ల‌ను వెల్ల‌డించిన విష‌యం తెల్సిందే. తాజాగా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర‌స్థాయి నీట్ యూజీ ర్యాంక్‌ల‌ను, కటాఫ్‌ మార్కులను విడుద‌ల చేశారు.
AP and TS NEET UG 2024 Counselling Dates

డాక్టర్ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితా ప్రకటించింది. దీనికి అనుగుణంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆగ‌స్టు తొలి వారం నుంచే..
ఆగస్టు మొద‌టి వారం నుంచే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా తెలిపింది. ఈ సంస్థ ప్రకటించిన తేదీల్లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌ను నిర్వహించాలి. మరోవైపు ఆగస్టు 14వ తేదీ నుంచి ఎంబీబీఎస్‌లో అకడమిక్ సెషన్‌ ప్రారంభమవుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రకటించింది.

జాతీయ స్థాయి కోటా సీట్ల భర్తీకి మొద‌టి రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇలా..:
☛➤ రిజిస్ట్రేషన్‌ తేదీలు : ఆగస్టు 14 నుంచి 20 వరకు. 
☛➤ సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు : ఆగస్టు 21, 22. 
☛➤ సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి : ఆగస్టు 23. 
☛➤ సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు : ఆగస్టు 24 నుంచి 29వ వరకు.

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇలా.. :
☛➤ రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు.
☛➤ సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు : సెప్టెంబరు 11, 12.
☛➤ సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి : సెప్టెంబర్ 13.
☛➤ సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు : సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు. 

మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఇలా..: 
☛➤ రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు. 
☛➤ సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: అక్టోబరు 3 నుంచి 4 వరకు.
☛➤ సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: అక్టోబరు 5.
☛➤ సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: అక్టోబర్‌ 6 నుంచి 12 వరకు.

మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల వివ‌రాలు ఇవే..
దేశవ్యాప్తంగా మొత్తం 710 వైద్య కళాశాలల్లో.. సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. వీటితోపాటు 21,000 బీడీఎస్‌ సీట్లతోపాటు ఆయుష్‌, నర్సింగ్‌ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. 

తెలంగాణ‌లో ఇలా..
తెలంగాణలో మొత్తం 720 మార్కులకు అన్‌ రిజర్వుడు/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. మొత్తం 49,143 మంది ర్యాంకులను ప్రకటించామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్‌మర్‌లోని ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు.

NEET Telangana MBBS Cutoff Ranks 2023-24

  GOVT Medical College  PVT Medical College 
Last Rank Marks Last Rank Marks
OC 152553 459 160979 452
EWS 142345 468 128866 480
BC-A 239443 394 258239 382
BC-B 166335 447 182756 434
BC-C 243919 391 266945 377
BC-D 164056 449 175555 440
BC-E 174324 441 184367 433
SC 219550 407 245043 390
ST 208457 415 230180 400

Minimum Cut off Marks for Eligibility : 

Category Percentile Marks
OC/EWS 50th 162
OC-PwD 45th 144
BC/SC/ST 40th 127

ఏపీలో ఇలా..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 720 మార్కులకు అన్‌ రిజర్వుడు/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161-127, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూబీడీ) విభాగాల్లో 143-127 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. మొత్తం 43,788 మంది ర్యాంకులను ప్రకటించామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు.

NEET Andhra Pradesh MBBS Cutoff Ranks 2023-24

  AU SVU
GOVT PVT GOVT PVT
Rank Marks Rank Marks Rank Marks Rank Marks
OC 48749 570 62930 551 54316 562 70138 542
EWS 39757 583 - - 57613 558 - -
BC-A 84205 526 107183 501 92952 517 119569 489
BC-B 78417 533 108486 500 92010 517 113190 495
BC-C 95971 513 103835 505 130166 479 158282 454
BC-D 53876 563 76065 535 90532 519 111696 497
BC-E 134319 475 153509 458 89332 520 112280 496
SC 155608 456 156858 455 136597 473 161718 451
ST 180199 436 208607 415 180091 436 211061 413
Published date : 03 Aug 2024 07:12PM

Photo Stories