NEET PG 2024: నీట్‌- పీజీ పిటిషన్‌పై విచారణ వాయిదా.. కారణమిదే!

NEET PG 2024

పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పీజీ పరీక్షపై దాఖలైన విచారణను సుప్రీంకోర్టు వాయిదావేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ అందుబాటులో లేనందున దసరా సెలవుల అనంతరం విచారణ జరగనుంది. కాగా ఆగస్టు 11న దేశ వ్యాప్తంగా నీట్‌పీజీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

Spot Admissions: ఈనెల 7 నుంచి డిగ్రీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

అదే నెల  ఆగస్టు 23న ఫలితాలను వెల్లడించారు. అయితే పరీక్షకు చివరి నిమిషంలో ప్రశ్నపత్రం నమూనాలో మార్పులు చేయడం, ఫలితాల ప్రక్రియలో పారదర్శకత పాటించలేదంటూ 19 మంది నీట్‌ విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో శుక్రవారం(అక్టోబర్‌04)న జరగాల్సిన విచారణ వాయిదాపడింది. త్వరలోనే  విచారణ తేదీని వెల్లడించనున్నారు. 

Job Mela: ఈనెల 8న జాబ్‌మేళా..నెలకు రూ. 20 వేల వరకు వేతనం

NEET PG 2024 కౌన్సెలింగ్‌ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌mcc.nic.inలో నమోదు చేసుకోవచ్చు. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags