PG Medical Seats: 25 వరకు తదుపరి చర్యలు తీసుకోం: హైకోర్టు
మెరిట్ జాబితాను కూడా ప్రకటించబోమని చెప్పింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం 25కు వాయిదా వేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీల నిబంధనలు 2021లోని రూల్ VIII( i), ( ii) చెల్లుబాటును సవాల్ చేస్తూ హైకోర్టులో మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎస్.సత్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వి.రజిత పిటిషన్ దాఖలు చేశారు.
నిబంధనల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 148 చట్టవిరుద్ధమని, దీని ప్రకారం తెలంగాణలో బ్యాచిలర్ మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను మాత్రమే పీజీ మెడికల్ సీటుకు స్థానిక కోటా కింద పరిగణిస్తారన్నారు.
చదవండి: Jobs: పారదర్శకంగా కొలువుల భర్తీ.. విరి మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు
తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే తెలంగాణ వెలుపలి విద్యా సంస్థల్లో(సిద్దార్థ మెడికల్ కాలేజీ) చదివిన వారిని స్థానికులుగా పేర్కొనడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా దాదాపు 100కుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం నవంబర్ 18న విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) విజ్ఞప్తి చేశారు. తదుపరి విచారణ వరకు ఎటువంటి కౌన్సెలింగ్ నిర్వహించబోమని హామీ ఇచ్చారు.