TS LAWCET 2024: లాసెట్‌ గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: లాసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగించారు. ఏప్రిల్ 25 వరకు ఎలాంటి పెనాల్టీ లేకుండా ఆన్‌­లైన్‌­లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

చదవండి: లాసెట్ - స్టడీ మెటీరియల్ | లా ఆప్టిట్యూడ్ | అర్థిమేటిక్ | రీజనింగ్ | గైడెన్స్‌ | కరెంట్‌ అఫైర్స్ | జనరల్‌ నాలెడ్జ్‌

లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయలక్ష్మి ఈ మేరకు ఒక ప్రకటన విడు­దల చేశారు. ముందుగా దరఖాస్తు చేసుకు­న్న వారికి సమీపంలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశముందని తెలిపారు.   

లా వైపు అడుగులు వేస్తున్న‌ ఎంబీబీఎస్‌, బీడీఎస్ విద్యార్థులు... 60 ఏళ్ల వృద్ధులు కూడా ఇటు వైపే... పూర్తి వివ‌రాలు ఇవే...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయశాస్త్ర కళాశాలల్లో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన‌ లాసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి.

న్యాయ విద్య అభ్యసించేందుకు వివిధ రంగాల వారు ముందుకొస్తున్నారు. ఉన్నత విద్యావంతులు, అధికారులు, ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో బీటెక్‌, ఎంబీబీఎస్‌ వంటి ఉన్నత విద్య పూర్తి చేసిన వారు ఉండటం విశేషం. 

సాధార‌ణంగా లా నేర్చుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు అనుకుంటుంటారు. చ‌ట్టం తెలిస్తే మ‌న చుట్టం అవుతుంద‌ని చాలా మంది భావిస్తుంటారు. 60 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన వారు కూడా లా రాస్తున్నారు. లా అంటే మ‌క్కువ‌తో చాలా మంది ఉద్యోగం నుంచి రిటైర్ అయిన త‌ర్వాత త‌మ అభిరుచిని చంపుకోలేక ఇటు వైపు అడుగులు వేస్తున్నారు.

#Tags