TS LAWCET 2024: లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్ లాసెట్, పీజీలాసెట్–2024 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు.
ఏప్రిల్ 25తో ముగిసిన గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి ఏప్రిల్ 25న పేర్కొన్నారు.
చదవండి: DY Chandrachud: గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి న్యాయ విద్య!!
డిగ్రీతో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఇంటర్ అర్హతతో అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి లాసెట్–2024లో అర్హత సాధించాలని వివరించారు. లా కోర్సులో ప్రవేశాలకు వయోపరిమితి లేదని స్పష్టం చేశారు.
Published date : 26 Apr 2024 12:34PM