H-1B visa: ఇండియ‌న్ టెకీల‌కు గుడ్‌న్యూస్‌... సెకండ్ రౌండ్ లాట‌రీ పూర్తి

ప్ర‌త్యేక నైపుణ్యాలు క‌లిగిన భార‌తీయ ఉద్యోగుల‌కు అమెరికా పెద్దఎత్తున స్వాగ‌తం ప‌లుకుతోంది. మేథ‌స్సుకు ఎప్పుడూ ఎర్ర‌తివాచీ ప‌రిచి ఆహ్వానించే యూఎస్‌.. అందుకు త‌గిన చ‌ర్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేస్తుంది. ఇందులో భాగంగా హెచ్‌-1బీ వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి తాజాగా శుభ‌వార్త అంద‌జేసింది.
ఇండియ‌న్ టెకీల‌కు గుడ్‌న్యూస్‌... సెకండ్ రౌండ్ లాట‌రీ పూర్తి

2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌1-బీ వీసాకు ఇప్ప‌టికే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మొద‌టి విడ‌త లాట‌రీని పూర్తి చేశారు. తాజాగా రెండో విడ‌త లాటరీ పూర్తి చేశారు. అమెరికన్‌ సంస్థల్లో చేరే ప్రత్యేక నైపుణ్యాలు గల ఉద్యోగులకు హెచ్‌1-బీ వీసాలు జారీ చేస్తారు. 

ఇవీ చ‌ద‌వండి: ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌–1బీ వీసా రెన్యువల్‌ ఇక అక్కడే!

అమెరికన్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వేలసంఖ్యలో ఉద్యోగులను ఈ వీసా ద్వారా నియమిస్తున్నాయి. అక్టోబరు ఒకటవ తేదీతో ప్రారంభమయ్యే ఈ ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1-బీ వీసాలకు అర్హత సాధించిన వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. యూఎస్‌ సిటిజెన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సేవల సంస్థ(యూఎస్‌సీఐఎస్‌) గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ వీసాల జారీకి రెండో విడత లాటరీ తీయాల్సి వచ్చింది.

ఇవీ చ‌ద‌వండి: H-1B వీసాదారులకు గుడ్‌న్యూస్‌... కెన‌డా ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం ఇదే..!

ప‌లువురు ఉద్యోగులు మొదటి విడత లాటరీకి ఒక‌టికి మించి రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నారు. దీంతో వీసాల జారీలో జాప్యం ఏర్ప‌డింది. వీసాల నమోదును దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు యూఎస్ అధికారులు తెలిపారు. 2020 నుంచి హెచ్‌1-బీ వీసాల‌ను ఎల‌క్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ ద్వారా జారీ చేస్తున్నారు.

ఇవీ చ‌ద‌వండి: ఏడేళ్లు నివాసముంటే US Green Card - సెనేట్ లో బిల్లు

#Tags