September Month Exams: సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: వివిధ ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష తేదీలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, యూపీఎస్సీలు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల తేదీలు ఇలా ఉన్నాయి.
సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

ఏపీ హైకోర్టు విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న సివిల్ జ‌డ్జ్ పోస్టుల‌కు సెప్టెంబ‌ర్ 2, 3వ తేదీల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించ‌నున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాత పరీక్ష సెప్టెంబర్ 25 నుంచి 27వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.

ఏపీపీఎస్సీ నిర్వ‌హించ‌నున్న గ్రూప్ 4 స‌ర్వీస్‌, నాన్ గెజిటెడ్, లెక్చ‌ర‌ర్స్ త‌దిత‌ర పోస్టుల‌కు 27వ తేదీ నుంచి వ‌చ్చే నెల 6వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. 

చ‌ద‌వండి: బీటెక్ అర్హ‌త‌తో ప‌వ‌ర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. ల‌క్ష‌కు పైగా జీతం అందుకునే అవ‌కాశం.!

టీఎస్‌పీఎస్‌సీ నిర్వ‌హించ‌నున్న పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ రాత పరీక్ష సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీల మ‌ధ్య నిర్వ‌హించ‌నున్నారు.

అలాగే టీఎస్‌పీఎస్‌సీ నిర్వ‌హించ‌నున్న ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్ పోస్టుల‌కు సంబంధించిన పరీక్ష 11వ తేదీ నిర్వ‌హించ‌నున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ నిర్వ‌హించ‌నున్న జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ ప‌రీక్ష ఈ నెల 12వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 3వ తేదీ మ‌ధ్య నిర్వ‌హించ‌నున్నారు.

చ‌ద‌వండి: డిగ్రీ అర్హ‌త‌తో ఎస్‌బీఐలో 6,160 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ టైర్‌ 1 ఎగ్జామ్ సెప్టెంబర్‌ 1-29 తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి.
ఐబీపీఎస్‌- క్లర్క్‌ ప్రిలిమ్స్ ప‌రీక్ష సెప్టెంబర్ 2 జ‌ర‌గ‌నుంది. 
యూపీఎస్సీ- ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌(2) సెప్టెంబర్ 3న జ‌ర‌గ‌నుంది.


యూపీఎస్సీ- సీడీఎస్‌ ఎగ్జామ్‌(2) సెప్టెంబర్ 3న నిర్వ‌హించ‌నున్నారు.

ఐబీపీఎస్‌- ఆర్‌ఆర్‌బీ ఆఫీస్‌ అసిస్టెంట్‌/ ఆఫీసర్‌ మెయిన్స్ ప‌రీక్ష‌లు సెప్టెంబర్‌ 10, 16వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. 
యూపీఎస్సీ- సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ ఎగ్జామ్ సెప్టెంబర్ 15న నిర్వ‌హించ‌నున్నారు. 

చ‌ద‌వండి: జ‌మిలి ఎన్నిక‌ల దిశ‌గా ఒడిఒడిగా అడుగులు... జ‌మిలి ఎన్నిక‌లు సాకార‌మ‌య్యేనా..?
ఇస్రో- అసిస్టెంట్‌ రాత పరీక్ష సెప్టెంబర్ 24న జ‌ర‌గ‌నుంది. 
ఐబీపీఎస్‌- ప్రొబేషనరీ ఆఫీసర్‌ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లు సెప్టెంబర్‌ 23, 30, అక్టోబర్ 1 మ‌ధ్య జ‌ర‌గ‌నున్నాయి.

#Tags